News October 6, 2025

తిరుపతి: అనుమతులు కోసం.. పేరుకే అరకు స్టాల్స్

image

తిరుపతి నగరంలో అరకు ఉత్పత్తులు విక్రయం, గిరిజన స్టాల్స్ వెలిశాయి. ఇవన్ని అనుమతుల కోసం, పేరుకు తప్ప ఎక్కడ కూడా గిరిజన ఉత్పత్తులు విక్రయించడం లేదు. ప్రధాన ప్రాంతాల్లో దుకాణాలు కోసం గిరిజన ఉత్పత్తులు అంటూ పెట్టి అనుమతి ఇవ్వని వస్తువులు సైతం విక్రయిస్తున్నారు. ఎవరైన దీనిపై ప్రశ్నిస్తే రాజకీయ నాయకుల నుంచి ఫోన్ కాల్స్ చేయిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వాటిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Similar News

News January 18, 2026

నీటి నిల్వకు ఇంకుడు గుంత ఎక్కడ తవ్వాలి?

image

ఇంకుడు గుంతను ఇంటి బయట ఈశాన్య దిశలో(పిశాచ స్థానంలో) నిర్మించడం వల్ల నీటి ఎద్దడి తప్పుతుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. అయితే, అన్ని సందర్భాల్లో ఈశాన్యంలోనే నీరు పడాలని లేదు కాబట్టి బోరుకు దగ్గరగా ఎక్కడైనా గుంత ఏర్పాటు చేసుకోవచ్చని చెబుతున్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోవాలని, కఠినమైన నియమాల కంటే అవసరానికి తగ్గట్టుగా శాస్త్రాన్ని అనువైన రీతిలో మార్చుకోవాలని వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>

News January 18, 2026

20న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్.. FEB 12న పోలింగ్?

image

TG: జనవరి 20న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 12న పోలింగ్ నిర్వహించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. దీనిపై కాసేపట్లో అధికారిక ప్రకటన రానుంది. కాగా సమ్మక్క-సారలమ్మ కొలువైన మేడారంలో తొలిసారి మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. 2027 గోదావరి పుష్కరాలతో పాటు రైతుభరోసాపై మంత్రులు చర్చిస్తున్నారు.

News January 18, 2026

టీడీపీని ఈ గడ్డపైకి తెచ్చే పన్నాగాలను జనం తిప్పికొడతారు: కేటీఆర్

image

TG: బీఆర్ఎస్ దిమ్మెలను కూల్చివేయాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై KTR ఫైరయ్యారు. ‘సీఎంగానే కాదు హోంమంత్రిగా ఉన్నావన్న సోయి లేకుండా BRS జెండా గద్దెలను ధ్వంసం చేయాలంటావా? శాంతిభద్రతల్లో పదేళ్లు దేశానికి ఆదర్శంగా నిలిచిన TGలో ఇప్పుడు అరాచకాలు చేసేవారు రాజ్యమేలడం ఓ దరిద్రం. బీఆర్ఎస్‌ను ఎదుర్కోలేక BJPతో చీకటి ఒప్పందాలు, టీడీపీని తిరిగి ఈ గడ్డపైకి తెచ్చే నీ పన్నాగాలను ప్రజలు తిప్పికొడుతారు’ అని మండిపడ్డారు.