News September 12, 2025

తిరుపతి: ఆన్‌లైన్ వ్యవసాయ కోర్సులకు దరఖాస్తులు

image

ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ బయో ఫెర్టిలైజర్స్- ప్రొడక్షన్& మేనేజ్మెంట్, తేనెటీగల పెంపకం విభాగాలలో తెలుగు మీడియంలో ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు అందిస్తుంది. ఆసక్తి కలిగిన యువత, రైతులు దరఖాస్తు చేసుకోవాలని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల కార్యాలయం పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు https://angrau.ac.in/ వెబ్ సైట్ ను చూడాలని సూచించారు. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్18.

Similar News

News December 15, 2025

వలిగొండలో ఉత్కంఠగా సాగిన కౌంటింగ్.. గెలిచిందెవరంటే?

image

వలిగొండ మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వెంకట పాపిరెడ్డి ప్రత్యర్థి BRS బలపరిచిన పలుసం రమేశ్ గౌడ్‌పై 472 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచాలు, మిఠాయిలతో సంబరాలు జరుపుకున్నారు. మొత్తం 7,212 ఓట్లు ఉండగా కాంగ్రెస్, BRS మధ్య నెక్ టూ నెక్ ఫైట్ సాగింది.

News December 15, 2025

నవాబ్‌పేట్‌లో గెలుపొందిన సర్పంచ్‌లు వీళ్లే..

image

వట్టిమీనపల్లి- సుక్కమ్మొళ్ళ మాణెమ్మ (బీఆర్‌ఎస్‌)
మూలమాడ – కందాడ స్వాతి (బీఆర్‌ఎస్‌)
అత్తాపూర్‌ -మేకల సంతోష్‌రెడ్డి (కాంగ్రెస్‌)
ఎక్‌మామిడి – మహిళ నర్మద (కాంగ్రెస్‌)
ఎత్‌రాజ్‌పల్లి – మల్గారి జగన్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌)
చించల్‌పేట – -గుడిసె అనుసూజ (కాంగ్రెస్‌)
ముబారక్‌పూర్‌ ఎస్సీ జనరల్‌ జామ జేజయ్య (స్వతంత్ర)

News December 15, 2025

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్ష.. చీఫ్ రాజీనామా

image

ప్రపంచంలోనే కఠినమైన పరీక్షలలో ఒకటైన సౌత్ కొరియా ‘సన్‌అంగ్’ మరోసారి వివాదంలో నిలిచింది. ఈ ఏడాది ఇంగ్లిష్ పేపర్‌పై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో సన్‌అంగ్ చీఫ్ ఓ సుంగ్‌ గియోల్ రాజీనామా చేశారు. ప్రతి ఏడాది నవంబర్‌లో జరిగే ఈ 8 గంటల పరీక్ష వర్సిటీల్లో ప్రవేశంతో పాటు ఉద్యోగావకాశాలను నిర్ణయిస్తుంది. 1993 నుంచి ఇప్పటివరకు నలుగురు మాత్రమే పూర్తి పదవీకాలం కొనసాగారు.