News April 12, 2025

తిరుపతి జిల్లాకు 8వ స్థానం

image

ఇంటర్ ఫలితాల్లో తిరుపతి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 27,441 మంది పరీక్షలు రాయగా 23, 651 మంది పాసయ్యారు. 86 శాతం పాస్ పర్సంటేజీతో తిరుపతి జిల్లా రాష్ట్రంలోనే 8వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో 30,350 మందికి 21, 633 మంది పాసయ్యారు. 71 శాతం పాస్ పర్సంటేజీతో తిరుపతి జిల్లా రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది.

Similar News

News April 17, 2026

రోజూ తలస్నానం చేయొచ్చా?

image

రోజూ తలస్నానం చేయడం జుట్టుకు హానికరమనేది అపోహ మాత్రమేనని డాక్టర్లు చెబుతున్నారు. జుట్టు ఆరోగ్యం స్కాల్ప్(మాడు) రకం, వాడే షాంపూపైనే ఆధారపడి ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారు రోజూ తలస్నానం చేస్తే చుండ్రు తొలగి జుట్టు శుభ్రంగా ఉంటుంది. డ్రై స్కాల్ప్ లేదా కలర్డ్ హెయిర్ ఉన్నవారు తరచూ చేస్తే జుట్టు పొడిబారే అవకాశం ఉంది. సల్ఫేట్ లేని మైల్డ్ షాంపూలు వాడితే రోజూ స్నానం చేసినా ప్రాబ్లమ్ ఉండదు.

News April 17, 2026

APPLY NOW: NICలో 153 ఉద్యోగాలు

image

153 పోస్టుల భర్తీకి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC), న్యూఢిల్లీ దరఖాస్తులను కోరుతోంది. వీటిలో సైంటిఫిక్‌-C-12, సైంటిస్ట్-D-141 పోస్టులున్నాయి. B.E/B.Tech/M.Sc/ME /M.Tech/M.Philతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. సైంటిస్ట్‌-Cకు 35, సైంటిస్ట్‌-Dకు 40 ఏళ్లు మించకూడదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ 30.4.26. మరిన్ని వివరాలకు recruitment.nic.in చూడండి.

News April 17, 2026

శ్రీకాళహస్తి గుడిలో భారీ మార్పులు ఇవే..!

image

శ్రీకాళహస్తి గుడిలో జరిగే రాహుకేతు పూజల్లో భారీ మార్పులు చేశారు. ప్రారంభం టికెట్ రూ.500 ఉండగా దాన్ని రద్దు చేశారు. రూ.750, రూ.1500, రూ.2500 యథావిధిగా కొనసాగుతాయి. రూ.5వేల టికెట్‌ను రూ.6వేలకు పెంచారు. శ్రీకాళహస్తి లోకల్ ప్రజలకు తెల్ల రేషన్ కార్డు ఉంటే ప్రతి బుధవారం రూ.100లకే 2వేల మందితో సామూహికంగా రాహు కేతు పూజ చేయిస్తారు.