News November 30, 2025
తిరుపతి జిల్లా స్కూళ్లకు రేపు సెలవు

తిరుపతి జిల్లాపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లా వ్యాప్తంగా సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈక్రమంలో తిరుపతి జిల్లాలోని అన్ని స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, అంగన్వాడీలకు కలెక్టర్ వెంకటేశ్వర్లు సోమవారం సెలవు ప్రకటించారు. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని కోరారు. చిత్తూరు జిల్లాలో సెలవుపై ఎలాంటి ప్రకటన రాలేదు.
Similar News
News February 10, 2026
మహదేవప్ప కుటుంబానికి అండగా ఉంటాం: రామచందర్ రావు

మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్రంగా స్పందించారు. గిరిజన నేతలపై కాంగ్రెస్‌కు ఉన్న కపట ప్రేమ మరోసారి బయటపడిందని, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎన్నికను వ్యతిరేకించడమే దానికి నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు, వారి గూండాలు మాఫియా తరహాలో బెదిరింపులకు దిగడం వల్లే యువ గిరిజన నేత మహదేవప్ప మృతి చెందడని ఆరోపించారు.
News February 10, 2026
నెల్లూరులో గీత దాటితే ఫైన్.. జాగ్రత్త!

నెల్లూరులో నూతన సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. DKW కళాశాల, KVR పెట్రోల్ జంక్షన్, VRC, కనకమహల్, రామలింగాపురం సహా ఏడు ప్రధాన కూడళ్లలో సిగ్నల్స్ పెట్టారు. వీటి పనితీరును కార్పొరేషన్ కమిషనర్ వై.ఓ నందన్ పరిశీలించారు. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే సిగ్నల్ వద్ద ఉన్న కెమెరాల్లో రికార్డు అవుతుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆ వాహనానికి ఫైన్ వేస్తారు. ఇదంతా మీకు తెలియకుండా జరుగుతుంది.
News February 10, 2026
తాబేలు ఉన్న ఉంగరాన్ని ధరిస్తే..?

జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆర్థిక కష్టాలు తొలగి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి తాబేలు ఉంగరం ధరించడం మంచిదని పండితులు చెబుతున్నారు. ‘ఈ ఉంగరాన్ని ముందుగా పాలు, గంగాజలంతో శుద్ధి చేయాలి. ముందుగా లక్ష్మీదేవి పాదాల చెంత ఉంచి పూజించాలి. గురువారం ఈ ప్రక్రియ పూర్తి చేసి, శుక్రవారం నాడు కుడిచేతి చూపుడు/మధ్య వేలుకు ధరించాలి. ఉంగరం పెట్టుకున్నప్పుడు తాబేలు ముఖం మీ వైపు ఉండేలా చూసుకోవాలి’ అని సూచిస్తున్నారు.


