News September 10, 2025
తిరుపతి: టీటీడీ ఛైర్మన్‌ను కలిసిన పూర్వపు ఈవో

టీటీడీ ఛైర్మన్ బి.ఆర్ నాయుడును బదిలీపై వెళ్తున్న పూర్వపు ఈవో శ్యామలరావు బుధవారం ఛైర్మన్ చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈవోగా పదవీకాలంలో తనకు అన్ని విధాల సహకరించిన బిఆర్ నాయుడుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. టీటీడీ ఛైర్మన్ శ్యామల రావును శాలువాతో సత్కరించి శ్రీవారి ప్రతిమను జ్ఞాపికగా అందజేశారు. తర్వాత కాసేపు ముచ్చటించారు.
Similar News
News December 11, 2025
తూ.గో: ఎంత కష్టం.. ప్రజాప్రతినిధులకు శాలరీలు లేవట!

ఉమ్మడి తూర్పుగోదావరిలో 1072 పంచాయతీలు, 62 జడ్పీటీసీ, 62 ఎంపీపీలు, 970 పైగా ఎంపీటీసీలు ఉన్నారు. అయితే క్షేత్రస్థాయిలో పని చేసే వీరికి రెండేళ్ల నుంచి ప్రభుత్వం గౌరవ వేతనాలివ్వడం లేదు. జడ్పీటీసీ, ఎంపీపీలకు రూ.6 వేలు, ఎంపీటీసీ, సర్పంచులకు రూ.3 వేలు వంతున వేతనాలివ్వాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ఇవి ఆగిపోయాయి. దీంతో ప్రజాప్రతినిధులు తమ వేతనాల కోసం ఆందోళనలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
News December 11, 2025
అర్ష్‌దీప్ చెత్త బౌలింగ్.. ఒకే ఓవర్‌లో 7 వైడ్లు

సౌతాఫ్రికాపై టీమ్ ఇండియా పేసర్ అర్ష్‌దీప్ చెత్త బౌలింగ్ చేశారు. ఒకే ఓవర్లో ఏకంగా 7 వైడ్లు వేశారు. తొలి బంతికే డికాక్ సిక్స్ కొట్టగా.. అనంతరం 7 బంతుల్లో 6 వైడ్లు వేశారు. తర్వాత 1, 2, 1 రన్స్ ఇచ్చారు. ఆపై మళ్లీ 7వ వైడ్ వేశారు. ఆఖరి బంతికి డికాక్ సింగిల్ తీశారు. ఈ ఓవర్లో ఎక్స్‌ట్రాలతో కలిపి మొత్తం 18 రన్స్ వచ్చాయి. అర్ష్‌దీప్ బౌలింగ్‌కు హెడ్ కోచ్ గంభీర్ కూడా తీవ్ర అసహనానికి గురైనట్లు కనిపించారు.
News December 11, 2025
ట్రంప్‍తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ‘ప్రెసిడెంట్ ట్రంప్‌తో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఆశా జనకంగా చర్చలు సాగాయి. రీజినల్, ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్స్‌పై కూడా చర్చించాం. గ్లోబల్ పీస్, స్టెబిలిటీ, శ్రేయస్సు కోసం ఇండియా, అమెరికా కలిసి పనిచేయడం కొనసాగిస్తాయి’ అని ప్రధాని ట్వీట్ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన తర్వాత జరిగిన ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


