News March 5, 2025

తిరుపతి: ట్రాక్టర్ ఢీకొని విద్యార్థి మృతి 

image

తిరుపతి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ఢీకొని అన్నదమ్మల్లో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన పుత్తూరు వద్ద పుత్తూరు-చెన్నై హైవేపై జరిగింది. నేషనూరు గ్రామానికి రవితేజ(17) అతని సోదరుడు బైకు మీద కాలేజీకి బయలుదేరారు. ఈ క్రమంలో వారిని ట్రాక్టర్ ఢీకొట్టింది. రవితేజ అక్కడికక్కడే మృతి చెందగా.. ముని కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News December 7, 2025

విశాఖలో రాత్రి పరిశుభ్రతపై జీవీఎంసీ కమిషనర్ ఆకస్మిక తనిఖీ

image

జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌ శనివారం రాత్రి ఆర్టీసీ కాంప్లెక్స్, సిరిపురం, సత్యం జంక్షన్, సీతమ్మధర, డైమండ్ పార్క్, తదితర ప్రాంతాల్లో రాత్రి పరిశుభ్రత పనులను తనిఖీ చేశారు. కార్మికులతో మాట్లాడి బాధ్యతగా పని చేయాలని సూచించారు. నగర పరిశుభ్రత కోసం రాత్రి సానిటేషన్ కీలకమని, వాణిజ్య ప్రాంతాల్లో వ్యర్థాల సమయానుసార సేకరణ తప్పనిసరి అని కమిషనర్ పేర్కొన్నారు.

News December 7, 2025

పుతిన్ వెళ్లారు.. జెలెన్‌స్కీ వస్తున్నారు!

image

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల ఇండియా టూర్ ముగిసిన వెంటనే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భారత పర్యటనకు సంబంధించిన తేదీలపై ఢిల్లీ కసరత్తు మొదలుపెట్టింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇరుపక్షాలతో సమానంగా సంబంధాలు కొనసాగించే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయమని నిపుణులు అంటున్నారు. శాంతి విషయంలో భారత్ తటస్థంగా ఉండదన్న PM మోదీ వ్యాఖ్యలు ఈ దౌత్య ధోరణికి బలం చేకూర్చాయి.

News December 7, 2025

HNK: వెంకట్ రెడ్డిపై మరో ఏసీబీ కేసు

image

స్కూల్ రెన్యూవల్‌కు <<18480655>>రూ.60 వేలు లంచం <<>>తీసుకుంటూ ACBకి దొరికిన HNK అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. ACB అధికారుల సోదాల్లో వెంకట్ రెడ్డి ఇంటిలోని బీరువాలో రూ.30 లక్షల నగదు దొరకడం, HYDలో ల్యాండ్ పేపర్లు, నగదు దొరకడంతో ఆదాయం మించిన ఆస్తుల కేసు కూడా నమోదు చేశారు. భారీగా నగదుతో పాటుగా విదేశీ మద్యం, బంగారు ఆభరణాలు దొరికినట్టు తెలిసింది. అధికారికంగా ఎంత విలువ ఉంటుందో ACB వెల్లడించనుంది.