News November 20, 2025

తిరుపతి: డిగ్రీ విద్యార్థులకు గమనిక

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పొడిగించారు. ఈ మేరకు SVU కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఫీజు తుది గడువు 18వ తేదీతో ముగియగా.. ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి ఫీజు చెల్లించాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు.

Similar News

News January 20, 2026

కొత్తగూడెం: శిశువు మృతి.. బంధువుల ఆందోళన

image

కొత్తగూడెం ప్రైవేట్ ఆసుపత్రిలో ఘోరం జరిగింది. అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందిందని ఆసుపత్రి ముందు బంధువులు బైఠాయించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీఐ శివ ప్రసాద్, ఎస్ఐ విజయ కుమారి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News January 20, 2026

నితీష్ ఫెయిలైనా అవకాశాలివ్వాలి: ఇర్ఫాన్ పఠాన్

image

NZతో జరిగిన మూడో వన్డేలో నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నారు. దీనిపై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్ నితీష్‌ను హార్దిక్ పాండ్యాకు సరైన బ్యాకప్‌గా అభివర్ణించారు. 135km వేగంతో బౌలింగ్, భారీ షాట్లు కొట్టగల బ్యాటింగ్ సామర్థ్యం అతనికి ఉందన్నారు. వరుసగా ఫెయిలైనా మరిన్ని అవకాశాలివ్వాలని సూచించారు. కోహ్లీతో కలిసి నితీష్ నెలకొల్పిన 88 పరుగుల భాగస్వామ్యం అతని టాలెంట్‌కు నిదర్శనమని పేర్కొన్నారు.

News January 20, 2026

అనకాపల్లి: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. భర్తను కడతేర్చేశారు

image

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి భార్య కడతేర్చిన ఘటన అనకాపల్లి(D) చీడికాడ(M) తూరువోలులో జరిగింది. కొండమ్మకు, గణేష్‌తో వివాహేతర సంబంధం ఉంది. భర్త డేగల చిన్నకు ఇది తెలియడంతో అడ్డుతొలగించుకోవాలనుకున్నారు. పథకం ప్రకారం గణేశ్ తన స్నేహితుడితో కలిసి 14న బైక్‌తో గుద్ది చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. విచారణలో విషయం బయటపడగా నిందితులను అరెస్టు చేసినట్లు DSP శ్రావణి తెలిపారు.