News January 28, 2025
తిరుపతి: డిప్యూటీ మేయర్ కోసం ఎన్నికల నోటిఫికేషన్

తిరుపతి కార్పొరేషన్‌లో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నికల నగర మోగింది. ఎన్నికల ముందు వరకు డిప్యూటీ మేయర్‌గా కొనసాగిన భూమన అభినయ్ రెడ్డి ఎన్నికల సందర్భంగా రాజీనామా చేశారు. ఆ తరువాత నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. బలం ఉన్న వైసీపీ తిరిగి వారికే వచ్చేలా చూస్తుండగా.. టీడీపీ సైతం తమ బలం చూపించే పనిలో ఉంది. ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే.
Similar News
News February 8, 2025
జాతీయస్థాయి అథ్లెటిక్స్‌లో విశాఖ క్రీడాకారులకు పతకాలు

రాజస్థాన్‌లో జరుగుతున్న 44వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో విశాఖ నుంచి 33 క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 5 స్వర్ణ, 7రజత, 10 కాంస్య పతకాలను సాధించి విజేతలుగా నిలిచారు. వీరికి శుక్రవారం పలువురు అభినందనలు తెలిపారు. విశాఖ అథ్లెట్స్ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాక్షించారు.
News February 8, 2025
సుగమ్య భారత్ యాత్రను ప్రారంభించిన ప్రకాశం కలెక్టర్

సమాజంలో దివ్యాంగులకు కూడా నూతన అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. విభన్నుల ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుగమ్య భారత్ యాత్రను శుక్రవారం ప్రకాశం భవనం వద్ద కలెక్టర్‌తో పాటు రాష్ట్ర విభన్న ప్రతిభా వంతులశాఖ డైరక్టర్ రవిప్రకాశ్ రెడ్డి జండా ఊపి ప్రారంభించారు.
News February 8, 2025
రాజమండ్రి: పార్కులు థీమ్స్ పార్క్‌లు అభివృద్ధి చేయాలి- కలెక్టర్

రాజమండ్రిలోని పార్కులను మూస పద్ధతిలో కాకుండా ఒక ప్రత్యేకత కలిగిన థీమ్‌లతో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి స్పష్టం చేశారు. 2027 పుష్కరాల నాటికి ఆమేరకు పనులు పూర్తి చెయాలని తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడారు. నగరంలోని 26 పార్కులను ఆయా పార్కుల అభివృద్ధి ఒక ప్రత్యేకత కలిగి ఉండేలా చూడాలని సూచించారు.