News June 22, 2024

తిరుపతి : దరఖాస్తులకు గడువు పొడిగింపు

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి శాస్త్రి, ఆచార్య, డిప్లొమా, సర్టిఫికెట్ మొదలైన 21 విభాగాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఈనెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు రిజిస్ట్రార్ రాఘవేంద్ర త్రిపాఠి పేర్కొన్నారు. అర్హత, ఇతర వివరాలకు svvedicuniversity.ac.in వెబ్‌సైట్ చూడాలని సూచించారు. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 30.

Similar News

News November 14, 2024

నిమోనియా దినోత్సవ గోడపత్రిక ఆవిష్కరించిన చిత్తూరు కలెక్టర్

image

నిమోనియా దినోత్సవ గోడపత్రికను చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నిమోనియా వ్యాధి లక్షణాలు, తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలపై వైద్య అధికారులు విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. ఈనెల 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు గ్రామాలలో విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలన్నారు.

News November 13, 2024

తిరుపతి: యజమాని చనిపోయారని తెలియక..!

image

తిరుపతి జిల్లాలో కన్నీరు పెట్టించే ఫొటో ఇది. ఏర్పేడు(M) బండారుపల్లికి చెందిన యశోద పొలానికి వెళ్లారు. గడ్డిమోపు తెస్తుండగా తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ తగిలి కరెంట్ షాక్ కొట్టింది. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషయం తెలియని పెంపుడు కుక్క ఆమె ఒడిలో అలాగే ఒదిగి ఉండిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు కంటతడి పెట్టారు.

News November 13, 2024

తిరుపతి: కరెంటు షాక్‌తో మహిళ మృతి 

image

తిరుపతి జిల్లాలో విషాదం నెలకొంది. ఏర్పేడు(M) బండారుపల్లిలో కరెంటు షాక్‌తో యశోద మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ఇవాళ ఆమె పొలం నుంచి గడ్డిమోపు తెస్తుండగా.. తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ తగిలింది. దీంతో కరెంట్ షాక్ తగిలి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె చనిపోయినప్పటికీ పెంపుడు కుక్క ఆమె ఒడిలో ఒదిగి ఉండడం అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ఆమె మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.