News December 1, 2025
తిరుపతి: రేపు పాఠశాలలకు సెలవు లేదు: డీఈవో

తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్య పాఠశాలలు మంగళవారం యథావిధిగా కొనసాగుతాయని డీఈవో కుమార్ తెలిపారు. దిత్వా తుఫాను ప్రభావం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఎలాంటి సెలవు లేదని స్పష్టం చేశారు. ఎంఈవోలు, డీవైఈవోలు విద్యార్థులకు సమాచారం అందించి పాఠశాలలు పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు.
Similar News
News February 16, 2026
నేడే ఖమ్మం మున్సిపల్ పీఠాలకు ఎన్నిక

ఉమ్మడి ఖమ్మంలో 7మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌కు చైర్మన్లు, మేయర్ ఎన్నిక ప్రక్రియ నేడు జరగనుంది. ఇప్పటికే కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా గణేష్ పేరు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ముందుగా వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో అధికారులు ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం ఛైర్మన్లు, మేయర్లను ఎన్నుకొనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా కార్యాలయాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News February 16, 2026
మెదక్‌లో నేటి ‘ప్రజావాణి’ వాయిదా

మెదక్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్నందున.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ‘హెల్ప్ డెస్క్’ ఏర్పాటు చేశామని సూచించారు.