News November 19, 2025
తిరుపతి రైతులకు నేడు నగదు జమ

తిరుపతి జిల్లా రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నగదు ఇవాళ విడుదల కానుంది. జిల్లాలోని 1,54, 908 మంది రైతులకు రూ.104 కోట్లు బుధవారం జమ చేయనున్నారు. కడప జిల్లా నుంచి సీఎం చంద్రబాబు నగదు విడుదల చేస్తారు. తిరుపతి జిల్లాలో ప్రస్తుతం వరినాట్లు మొదలయ్యాయి. వీరికి ఈ నగదు ఎంతగానో ఉపయోగపడనుంది.
Similar News
News January 20, 2026
ఖమ్మంలో పూడ్చిపెట్టిన మహిళ మృతదేహానికి పోస్టుమార్టం

ఖమ్మం రమణగుట్టలో సంచలనం రేపిన శైలజ(26) మరణంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనారోగ్యంతో మరణించిందని నమ్మించి భర్త సురేందర్ హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించగా, అనుమానం వచ్చిన మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ పర్యవేక్షణలో సోమవారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. వివాహేతర సంబంధం కోసమే ఇంజెక్షన్‌తో భార్యను హతమార్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
News January 20, 2026
నెల్లూరు: 12 ఏళ్లలో పల్లె నుంచి పారిశ్రామిక హబ్ దాకా.!

గత 12 ఏళ్లలో ముత్తుకూరు ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. 2014లో కేవలం చేపల వేట, రొయ్యల సాగుకే పరిమితమైన ఈ తీర ప్రాంతం, 2026 నాటికి ఏపీలోనే కీలక ఆర్థిక కేంద్రంగా ఎదిగింది. అదానీ పోర్ట్ విస్తరణ, భారీ థర్మల్ ప్లాంట్లు, 4-లేన్ రోడ్లతో నేడు గ్లోబల్ మ్యాప్‌లోకి ఎక్కింది. నాడు వలసలకు నిలయమైన ముత్తుకూరు, నేడు వేలాది మందికి స్థానికంగానే ఉపాధి కల్పిస్తూ, రియల్ ఎస్టేట్‌లో రికార్డులు సృష్టిస్తోంది.
News January 20, 2026
ఆర్సీబీ సరికొత్త చరిత్ర

WPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త చరిత్ర సృష్టించింది. టోర్నీలో వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా నిలిచింది. గత సీజన్‌లో RCB తన చివరి మ్యాచ్‌లో గెలవగా ఈసారి వరుసగా ఐదు విజయాలు ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో 2024లో తొలి ట్రోఫీని గెలుచుకున్న స్మృతి సేన మరోసారి టైటిల్‌పై కన్నేసింది. నిన్న గుజరాత్‌తో మ్యాచులో విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.


