News November 19, 2025
తిరుపతి రైతులకు నేడు నగదు జమ

తిరుపతి జిల్లా రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నగదు ఇవాళ విడుదల కానుంది. జిల్లాలోని 1,54, 908 మంది రైతులకు రూ.104 కోట్లు బుధవారం జమ చేయనున్నారు. కడప జిల్లా నుంచి సీఎం చంద్రబాబు నగదు విడుదల చేస్తారు. తిరుపతి జిల్లాలో ప్రస్తుతం వరినాట్లు మొదలయ్యాయి. వీరికి ఈ నగదు ఎంతగానో ఉపయోగపడనుంది.
Similar News
News January 22, 2026
సింహాచలంలో జనవరి 25న కొన్ని అర్జీత సేవల రద్దు

రధసప్తమి సందర్బంగా సింహాచలం వరహాలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో జనవరి 25న ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఈవో సుజాత బుధవారం తెలిపారు. ఆరోజు ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులను రాతి రథం మీద వేంచేయింపచేసి అభిషేకం, విశేష ఆరాధన నిర్వహిస్తారు. ఆరోజున నిత్య కళ్యాణం తప్ప మిగిలిన ఆర్జిత సేవలు సుప్రభాతం, ఆరాధనం, స్వర్ణ పుష్పార్చనం, గరుడ సేవ, సహస్రనామర్చనం, లక్ష్మీ నారాయణ వ్రతాలు రద్దు చేశారు.
News January 22, 2026
NZB: రంజాన్ ఏర్పాట్లపై షబ్బీర్ అలీ సమీక్ష

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ముస్లింలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో మంత్రి అజారుద్దీన్‌తో కలిసి నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ముఖ్యంగా ఉమ్మడి జిల్లాతోపాటు తెలంగాణ వ్యాప్తంగా మసీదుల వద్ద పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్ ఉండాలని, ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు.