News November 19, 2025
తిరుపతి రైతులకు నేడు నగదు జమ

తిరుపతి జిల్లా రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నగదు ఇవాళ విడుదల కానుంది. జిల్లాలోని 1,54, 908 మంది రైతులకు రూ.104 కోట్లు బుధవారం జమ చేయనున్నారు. కడప జిల్లా నుంచి సీఎం చంద్రబాబు నగదు విడుదల చేస్తారు. తిరుపతి జిల్లాలో ప్రస్తుతం వరినాట్లు మొదలయ్యాయి. వీరికి ఈ నగదు ఎంతగానో ఉపయోగపడనుంది.
Similar News
News January 18, 2026
బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇక రూ.30 లక్షల పరిహారం!

RBI కొత్త ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్‌ను ప్రకటించింది. దీని ప్రకారం బ్యాంకింగ్ సేవల్లో లోపాల వల్ల కస్టమర్లకు కలిగే నష్టానికి ఇచ్చే పరిహారాన్ని ₹20లక్షల నుంచి ₹30లక్షలకు పెంచింది. మానసిక వేదన, టైమ్ వేస్ట్ అయినందుకు ఇచ్చే పరిహారాన్నీ ₹లక్ష నుంచి ₹3 లక్షలు చేసింది. జులై 1 నుంచి అమల్లోకి రానున్న ఈ రూల్స్ అన్ని బ్యాంకులు, NBFCలకు వర్తిస్తాయి. కస్టమర్లు ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో పరిష్కరించుకోవచ్చు.
News January 18, 2026
బల్కంపేట్ ఎల్లమ్మకి మౌని అమావాస్య ప్రత్యేక పూజలు

మౌని అమావాస్య సందర్భంగా బల్కంపేట్ రేణుకా ఎల్లమ్మ తల్లిని ప్రత్యేకంగా అలంకరించారు. పలు రకాల పుష్పాలు, ఫలాలతో అమ్మవారిని అత్యంత సుందరంగా గర్భగుడిని తీర్చిదిద్దారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించి, దీప ధూప నైవేద్యాలు సమర్పించి, మంగళహారతులు ఇచ్చారు. భక్తజన సందోహంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. దర్శనానికి సుమారు 30 నిమిషాల సమయం పడుతోందని భక్తులు తెలిపారు.
News January 18, 2026
సీపీఐ 100 ఏళ్ల పండుగకు సీఎం

ఖమ్మంలో నేడు జరిగే సీపీఐ శతవసంతాల ముగింపు సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు బీజేఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో జరిగే సీపీఐ శతాబ్ది ఉత్సవ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. కాగా ఈ సభకు రావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం సీఎంకు ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. మిత్రపక్షం ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి సభకు వెళ్తున్నారు.


