News August 14, 2025
తిరుపతి స్విమ్స్‌లో MBBS అడ్మిషన్ల ప్రారంభం

తిరుపతి స్విమ్స్, శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాలలో MBBS అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కర్నూలుకు చెందిన సాయిశ్రీ నిత్య నీట్-2025లో 14,255వ ర్యాంకు సాధించింది. ఆమెకు ఇక్కడ మొదటి అడ్మిషన్ ఇచ్చారు. ఆలిండియా కోటా ద్వారా ఈ కాలేజీకి 26 సీట్లు కేటాయించారు. ఓ అడ్మిషన్ పూర్తయ్యందని స్విమ్స్ ఉపకులపతి డా.ఆర్.వి.కుమార్ చెప్పారు.
Similar News
News March 11, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 11)

1689: ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మరణం
1915: భారత లెజెండరీ క్రికెటర్ విజయ్ హజారే జననం (ఫొటోలో)
1922: తెలుగు సినిమా నేపథ్య గాయకుడు మాధవపెద్ది సత్యం జననం
1955: పెన్సిలిన్ సృష్టికర్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరణం
1979: తెలుగు సాహితీకారుడు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ మరణం
News March 11, 2026
మావోయిస్టులకు కొత్తగూడెం ఎమ్మెల్యే ఓపెన్ ఆఫర్..!

ప్రజాబలంలేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమ సమాజాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా సాధించుకుందామని, ఇందుకు కలిసి పని చేసేందుకు జన జీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు మాతృ పార్టీ సీపీఐలో చేరాలని హైదరాబాద్ మగ్దూం భవన్లో జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.
News March 11, 2026
ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు ఆపండి: US

ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌ను అమెరికా కోరినట్లు US మీడియా సంస్థ Axios పేర్కొంది. ఇరాన్ ఆయిల్, ఎనర్జీ సదుపాయాలపై మరిన్ని దాడులు చేస్తే ఆ దేశ ప్రజలకు హాని కలగవచ్చని, ఆయిల్ ధరలు భారీగా పెరగొచ్చని US చెప్పినట్లు తెలిపింది. అలాగే గల్ఫ్ దేశాల ఎనర్జీ సదుపాయాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేసే అవకాశమూ ఉందని, యుద్ధం తర్వాత ఆయిల్ సెక్టార్‌కు ఇరాన్ సహకారం అవసరమని US భావిస్తోందని వెల్లడించింది.


