News August 23, 2025
తిరుపతి హథీరాంజీ మఠం కూల్చివేతపై వివాదం

తిరుపతి హథీరాంజీ మఠం కూల్చివేతపై వివాదం రేగింది. భవనం శిథిలావస్థలో ఉందని, నివాసయోగ్యం కాదని ఐఐటీ నిపుణులు నివేదిక ఇవ్వగా కలెక్టర్ వెంకటేశ్వర్ నేడు మఠాన్ని పరిశీలించనున్నారు. మఠాన్ని కూల్చొద్దని, వారసత్వ కట్టడంగా కొనసాగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణకు చెందిన MLC కవిత స్పందిస్తూ.. కూల్చివేత బంజారాల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు. కూల్చివేతపై అధికారులు పునరాలోచించాలని ఆమె కోరారు.
Similar News
News January 19, 2026
KNR: సబ్ లీజు’ దందా.. విద్యాశాఖ పట్టించుకోవట్లే!

KNR ప్రకాష్ గంజ్ హై స్కూల్ దుకాణ సముదాయాల్లో లీజు పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. లీజుదారులు 21 దుకాణాలకు గాను ఒక్కో షాపుకు రూ.వెయ్యి చొప్పున విద్యాశాఖకు చెల్లిస్తూ రూ.20 వేలకు సబ్ లీజుదారుల నుంచి వసూలు చేస్తున్నారని, ముగ్గురు లీజుదారులు ప్రముఖ వ్యాపారులకు అగ్రిమెంట్ పద్ధతిలో ఏకంగా అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయి. విద్యాశాఖ ఈ అక్రమాలకు చెక్ పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
News January 19, 2026
బంధంలో బ్యాలెన్స్ ముఖ్యం

అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలనుకునే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేగానీ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతోనో, నలుగురూ వేలెత్తి చూపుతారన్న భయంతోనో నిరంతరం అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్న వారవుతారు. కాబట్టి బంధమేదైనా అన్ని రకాలుగా బ్యాలన్స్‌డ్‌గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
News January 19, 2026
నెల్లూరు: నేడు పాఠశాలలు ప్రారంభం

సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో జిల్లావ్యాప్తంగా నేడు పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే విద్యార్థులతో స్కూల్ ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఉపాధ్యాయులు హాజరై తరగతులు నిర్వహించారు. సెలవుల తరువాత మళ్లీ చదువుల వాతావరణం నెలకొనడంతో విద్యార్థుల్లో ఉత్సాహం కనిపించింది. తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు పంపుతూ హర్షం వ్యక్తం చేశారు.


