News October 18, 2024
తిరుపతి: హరిత భర్త కూడా మృతి
కోడలి మృతదేహం కోసం ఎదురుచూస్తున్న వారికి కొడుకు చనిపోయాడని తెలియడంతో తీరని శోకంలో మునిగిపోయారు. తిరుపతి జిల్లా కేవీబీపురం(M) కాళంగికి చెందిన చెన్ను బ్రహ్మానందరెడ్డి, సుగుణమ్మ ఒక్కగానొక్క కుమారుడు సాయిరెడ్డి అమెరికా వెళ్లారు. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన భార్య హరిత 2 రోజుల కిందటే చనిపోయిన విషయం తెలిసిందే. సాయిరెడ్డి చికిత్స పొందుతూ కన్నుమూశారు. వారి మృతదేహాలు ఆదివారం ఇక్కడికి రానున్నాయి.
Similar News
News November 2, 2024
తిరుపతి: పెన్షన్ తీసుకోని వారు అందుబాటులో ఉండండి: కలెక్టర్
తిరుపతి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు పండుగ వాతావరణంలో పంపిణీ చేసినట్లు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలో 2,65,488 మందికి 5295 మంది సచివాలయ సిబ్బంది ద్వారా రూ.112.37 కోట్ల పంపిణీకి చర్యలు చేపట్టామని తెలిపారు. ఏదేని కారణం చేత పెన్షన్ల నేడు తీసుకోలేని వారికి 2వ తేదీన పంపిణీ చేస్తామని వారు వారి ఇంటి వద్ద అందుబాటులో ఉండాలన్నారు.
News November 1, 2024
ఎల్లుండి భూమన ప్రమాణ స్వీకారం
వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్తూరు-తిరుపతి హైవే మార్గంలో సదరన్ స్పైస్ సమీపంలో ఆదివారం భూమన ప్రమాణ స్వీకారం జరగనుంది. సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు తదితరులు హాజరు కానున్నారు.
News November 1, 2024
CTR: అసిస్టెంట్ ఎలక్ట్రిషియన్ కోర్సులో ఉచిత శిక్షణ
APSSSC, PMKVY సంయుక్త ఆధ్వర్యంలో చిత్తూరు ఇరువారంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(NAC)లో అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు కోఆర్డినేటర్ నాగరత్న పేర్కొన్నారు. 8వ తరగతి పాసై, 15 నుంచి 35 ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు ఇరువారం పీహెచ్ కాలనీ సమీపంలోని NAC కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 4.