News May 21, 2024
తిరుమలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాక

తిరుమల శ్రీవారి దర్శనానికి మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఇవాళ సాయంత్రం కుటుంబ సభ్యులతో పాటు రానున్న ఆయన రాత్రి కొండపై బస చేయనున్నారు. బుధవారం ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు.
Similar News
News March 9, 2026
చిత్తూరు: పెరిగిన ధరలు.. ఆందోళనలో ప్రజలు

పశ్చిమ ఆసియా యుద్ధం నేపథ్యంలో పెరిగిన గ్యాస్ ధరలు సామాన్య ప్రజానీకానికి భారంగా మారాయి. చిత్తూరు జిల్లాలో 46 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో సుమారు 6 లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. గృహ అవసరాల గ్యాస్ సిలిండర్‌పై రూ.60, వాణిజ్య సిలిండర్‌పై రూ.115 పెంచారు. సింగిల్ సిలిండర్ ఉన్నవారు, పొందిన నాటి నుంచి 21 రోజుల తర్వాత మాత్రమే మళ్లీ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు.
News March 9, 2026
చిత్తూరు: 18 వరకు గడువు పెంపు

పంచాయతీలో ఓటరు ముసాయిదా జాబితా ప్రచురణ గడువును ఈనెల 18 వరకు పొడిగించినట్లు డీపీఓ సుధాకర్ రావు తెలిపారు. మార్చి 9కి జాబితాను ప్రచురించాలని ముందుగా ఉన్నతాధికారులు గడువు ఇచ్చారు. కానీ సాంకేతిక సమస్యల కారణంగా నమోదులో ఆలస్యం అవుతోంది. ఇంకా 10% మ్యాపింగ్ ప్రక్రియ చేయాల్సి ఉందన్నారు. ఇచ్చిన గడువులోగా వాటిని పూర్తి చేస్తామన్నారు.
News March 9, 2026
చిత్తూరు: పకడ్బందీగా పది పరీక్షలు

జిల్లాలో పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నట్టు డీఈఓ రాజేంద్రప్రసాద్ తెలిపారు. 129 కేంద్రాలలో 24,931 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్టు చెప్పారు. పరీక్షా కేంద్రానికి అరగంట ముందుగా విద్యార్థులు చేరుకోవాలని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్‌లకు అనుమతి లేదన్నారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.


