News September 12, 2025

తిరుమలపై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: TTD

image

శ్రీవారి భక్తుల మనోభావాలను రెచ్చగొట్టేలా తిరుమలపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని TTD తెలిపింది. అలిపిరి నడక మార్గంలో చికెన్ బిర్యానీ హోటల్స్ ప్రకటనలు, చంద్రగిరి వెళ్లే రోడ్డుపై ఉంచిన బారికేడ్‌పై హోటల్ ప్రకటనకు స్వామివారి పవిత్రనామాల ఆడియోను జతచేసి కొంతమంది సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు గుర్తించామంది. ఇలాంటి వాటిని నమ్మొద్దని భక్తులకు టీటీడీ విన్నవించింది.

Similar News

News December 17, 2025

స్పీకర్ తీర్పు రాజ్యాంగవిరుద్ధం: BRS ఎమ్మెల్యే

image

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ <<18592868>>తీర్పు<<>> రాజ్యాంగవిరుద్ధమని BRS ఎమ్మెల్యే వివేకానంద ఫైరయ్యారు. ఆయన తీర్పుపై న్యాయపోరాటం చేస్తామన్నారు. అనర్హత పిటిషన్లను వేటి ఆధారంగా డిస్మిస్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ సంస్థలను కాంగ్రెస్ ఖూనీ చేస్తోందని, స్పీకర్ నిర్ణయం ఊహించిందేనని మండిపడ్డారు. దమ్ముంటే ఫిరాయింపు MLAలను రాజీనామా చేయించి ఉపఎన్నిక నిర్వహించాలని సీఎం రేవంత్‌కు సవాల్ చేశారు.

News December 17, 2025

పాడేరు: ‘రుణాల పరిమితి పెంచాలి’

image

అల్లూరి జిల్లాలో వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలకు రుణాల పరిమితి పెంచాలని ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. పాడేరు జిల్లా కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ప్రిలిమనరీ డీసీసీ సమావేశం నిర్వహించారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాల రైతులకు రుణాలు అందించి ప్రోత్సహించాలని సూచించారు. కౌలు రైతులకు, పశు సంవర్ధక, పట్టు పరిశ్రమలకు కిసాన్ క్రెడిట్ కార్డుతో రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు.

News December 17, 2025

అల్లూరి: అంతర్జాతీయ వేదికపై మెరిసిన రవనికి అభినందనలు

image

డిసెంబరు 13న దుబాయ్‌లో జరిగిన ఆసియా యూత్ పారా గేమ్స్ అథ్లెటిక్స్‌లో పారా అథ్లెటిక్స్‌లో రవని అద్భుత ప్రతిభ కనబరిచింది. 400 మీటర్ల పరుగులో స్వర్ణం, 200 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించడం అల్లూరి జిల్లాకు గర్వకారణం. రవని విజయం యువతకు ప్రేరణగా నిలుస్తోందని హుకుంపేట సామాజిక సేవకులు, గ్రామస్థులు అభినందించారు.