News November 20, 2024
తిరుమలలో ”అన్నప్రసాదం” విరాళానికి కియోస్క్ మిషన్లు

టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కియోస్క్(KIOSK) మిషన్‌ను టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ మిషన్‌ను టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి బుధవారం ప్రారంభించారు. ఈ మిషన్‌ను కెనరా బ్యాంకు టీటీడీకి విరాళంగా అందించింది. రూ.1 నుంచి రూ.99,999 వరకు తమకు తోచిన మొత్తాన్ని భక్తులు యూపీఐ ద్వారా విరాళం ఇవ్వవచ్చు.
Similar News
News March 9, 2026
పోలీస్ శాఖ PGRSను సద్వినియోగం చేసుకోండి : ఎస్పీ

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నేడు ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్పీ కార్యాలయం వెల్లడించింది. ఉదయం10:30 గంటలకు పాత డీపీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను జిల్లా స్థాయి పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసి సమస్యలను పరిష్కరించుకోవాలని ఎస్పీ కోరారు. ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాధితులకు వివరించారు.
News March 8, 2026
చిత్తూరు కలెక్టరేట్‌లో రేపు గ్రీవెన్స్ డే

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. సమస్యలపై meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అదేవిధంగా డయల్ 1100 కు కాల్ చేసి తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు.