News November 16, 2025
తిరుమలలో ఈ ఆలయాన్ని దర్శించుకున్నారా?

స్వామివారి పుష్కరిణికి వాయువ్యంలో ఉన్న వరాహస్వామి ఆలయాన్ని తప్పక దర్శించుకోవాలి. పురాణాల ప్రకారం.. విష్ణుమూర్తి వరాహావతారంలో భూమిని పైకెత్తారు. ఆయన అనుమతితోనే శ్రీనివాసుడు తిరుమలలో వెలిశారు. అందుకే, తిరుమలలో తనను దర్శించుకునే భక్తులందరూ ముందుగా భూవరాహస్వామిని దర్శించుకుంటారని శ్రీనివాసుడు చెప్పారు. ఇప్పటికీ శ్రీవారి దర్శనానికన్నా ముందు దర్శనం, నైవేద్యం వరాహస్వామికే సమర్పిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
Similar News
News January 19, 2026
బంధంలో బ్యాలెన్స్ ముఖ్యం

అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలనుకునే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేగానీ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతోనో, నలుగురూ వేలెత్తి చూపుతారన్న భయంతోనో నిరంతరం అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్న వారవుతారు. కాబట్టి బంధమేదైనా అన్ని రకాలుగా బ్యాలన్స్‌డ్‌గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
News January 19, 2026
వరిలో కాండం తొలిచే పురుగు నివారణ ఎలా?

వరి నారుమడి దశలో కాండం తొలిచే పురుగును గుర్తిస్తే నారుమడిలో కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు లేదా 600 గ్రా. ఫిప్రోనిల్ 0.3జి గుళికలు వేయాలి. ఒకవేళ నారుమడిలో వేయకపోతే 15 రోజుల వయసున్న, పిలకదశలో ఉన్న వరిపైరులో తప్పకుండా ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు 10KGలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8KGలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4G గుళికలు 4kgలను 20-25 కిలోల ఇసుకలో కలిపి బురద పదునులో వేయాలి.
News January 19, 2026
‘ధురంధర్’ విలన్ రోల్.. నో చెప్పిన నాగార్జున!

రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం కొనసాగిస్తోంది. ఈ మూవీలో విలన్ రోల్ కోసం ముందుగా టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునను సంప్రదించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. అయితే పాత్ర నచ్చినా అప్పటికే కూలీ, కుబేర సినిమాల్లో నటిస్తుండటంతో డేట్స్‌ను అడ్జస్ట్ చేయలేక నాగ్ ఆఫర్‌ను తిరస్కరించారని పేర్కొన్నాయి. దీంతో చివరకు అక్షయ్ ఖన్నాను సెలక్ట్ చేశారని వెల్లడించాయి.


