News November 5, 2025
తిరుమలలో మహిళ మృతి.. ఈమె మీకు తెలుసా?

తిరుమల మెయిన్ కళ్యాణకట్ట ఎదురుగా ఓపెన్ షెడ్‌లో ఓ మహిళకు ఫిట్స్ వచ్చాయి. వెంటనే అశ్విని ఆసుపత్రికి అక్కడి నుంచి తిరుపతి రుయాకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఆమె పేరు ఏ.మంగ(40) అని మాత్రమే తెలిసింది. ఎవరైనా ఈ మహిళను గుర్తిస్తే తిరుమల వన్ టౌన్ పోలీసులను 9440796768, 9440796771, 0877-2289027 నంబర్ల ద్వారా సంప్రదించాలని కోరారు.
Similar News
News January 15, 2026
ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు… అప్లై చేశారా?

<
News January 15, 2026
ఇంద్రవెల్లి: ఇక ఈ బాధ్యత.. అల్లుడిదే..!

ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద గిరిజనుల జాతరగా పేరుగాంచిన కేస్లాపూర్ నాగోబా జాతర ఈనెల 18న ప్రారంభం కానుంది. మెస్రం వంశీయులు హస్తినమడుగు పవిత్ర గంగాజలాన్ని సేకరించారు. మర్రిచెట్టుపై గంగా జలాన్ని భద్రపరిచారు. కలశం (జారీతాలి) నేలపై జారి పడకుండా మహాపూజలు అయ్యే వరకు చెట్టుపై మెస్రం వంశానికి చెందిన అల్లుడే భద్రపరుస్తుంటారు. ఈనెల 15, 16, 18న మహాపూజ, 22న దర్బార్, 22న పెర్సపేన్ బాన్కక్ పూజలు నిర్వహించనున్నారు.
News January 15, 2026
HYD: ఫ్యూచర్ సిటీలో ట్రాఫిక్ రద్దీకి చెక్

మహానగరంలో ట్రాఫిక్ తిప్పలు అంతా ఇంత కాదు. కిలోమీటర్ ప్రయాణించాలంటే నరకం కనిపిస్తుంది. కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్‌లో ఈ సమస్య ఉండొద్దని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. భవిష్యత్ ట్రాఫిక్ రద్దీని ముందే అంచనా వేసి మహేశ్వరం, శంషాబాద్ ట్రాఫిక్ జోన్లుగా విభజించి 4 డివిజన్లు, 10 ట్రాఫిక్ PSలను నెలకొల్పనున్నారు. సమర్థ పర్యవేక్షణకు ట్రాఫిక్ జాయింట్ సీపీని కూడా నియమించనున్నారు.


