News December 1, 2025
తిరుమల ఆలయం వద్ద జనసేన గొడుగు

తిరుమల శ్రీవారి ఆలయం వద్ద సోమవారం జనసేన పేరుతో ఉన్న గొడుగు కనిపించింది. ఓ వ్యక్తి గొడుగును వేసుకుని ఆలయం వద్ద ఉండగా.. విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వెంటనే గొడుగును స్వాధీనం చేసుకుని అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తనిఖీలు సరిగ్గా లేకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని భక్తులు ఆరోపించారు.
Similar News
News February 18, 2026
జగిత్యాల: ‘ఇందిరమ్మ ఇళ్లను 100% గ్రౌండ్ చేయాలి’

ఇందిరమ్మ ఇళ్లను 100% గ్రౌండ్ చేయాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. మార్క్ అవుట్ చేయని ఇందిరమ్మ ఇళ్ల పట్టణ, రూరల్ ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న వాటికి ముగ్గు పోసి పనులు ప్రారంభించాలని తెలిపారు. మార్క్ అవుట్ చేయని పక్షంలో వాటిని రద్దు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని అన్నారు.
News February 18, 2026
సారంగాపూర్: దుబ్బరాజన్న హుండీ లెక్కింపు పూర్తి

పెంబట్ల-కోనాపూర్ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు బుధవారం జరిగినట్టు ఈఓ వి.అనూష తెలిపారు. టికెట్ల ద్వారా రూ.27,38,312=00, హుండీ ద్వారా రూ.21,27,684=00, వేలం ద్వారా రూ.12,71,000=00, మొత్తం రూ.61,36,996=00, గత సంవత్సరం కంటే రూ.1,43,008=00 అధికంగా సమకూరింది. మిశ్రమ బంగారం 33గ్రా.510మి.,మిశ్రమ వెండి 7.580 కి.గ్రా. సమకూరింది. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
News February 18, 2026
అన్నమయ్య: రంజాన్ వేళ.. ఉర్దూ మీడియం స్కూల్ వేళల్లో మార్పులు

రంజాన్ మాసం సందర్భంగా అన్నమయ్య జిల్లాలోని అన్ని ఉర్దూ మాధ్యమ పాఠశాలలు రేపు ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహిస్తారని DEO సుబ్రమణ్యం తెలిపారు. ఈ సమయాలు రంజాన్ కాలానికి మాత్రమే వర్తిస్తాయి. పదో తరగతి యాక్షన్ ప్లాన్‌పై స్పష్టత వచ్చే వరకు స్లిప్ టెస్టులు యథావిధిగా నిర్వహించాలన్నారు. ముస్లిం ఉద్యోగులకు ప్రతిరోజూ ఒక గంట ముందుగా వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.


