News September 11, 2025
తిరుమల చేరుకున్న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్

తిరుమల శ్రీవారి దర్శనార్థం గురువారం సాయంత్రం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గాయత్రి అతిథి భవనం వద్దకు చేరుకున్నారు. ముందుగా ఆమెకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మురళీకృష్ణ, రిసెప్షన్ డిప్యూటీ ఈవో భాస్కర్ స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. రాత్రికి ఆమె తిరుమలలో బస చేసి శుక్రవారం ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు.
Similar News
News December 14, 2025
నాగర్‌కర్నూల్ మండలంలో 85.1% పోలింగ్

నాగర్‌కర్నూల్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 85.1 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. మొత్తం 18 పంచాయతీలకు గాను 29,282 మంది (పురుషులు 14,617, మహిళలు 14,665) ఓటు వేశారు. అత్యధికంగా నర్సాయిపల్లి గ్రామంలో 90.9 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
News December 14, 2025
RR: ఆమనగల్లు(M) శంకరకొండ సర్పంచ్‌గా రాములు

ఆమనగల్లు మండల పరిధిలోని 12 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శంకరకొండ సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన రాములు 101 ఓట్లతో విజయం సాధించారు. దీంతో గ్రామంలో అంబరాన్నంటేలా సంబరాలు నిర్వహించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.
News December 14, 2025
ఇంద్రానగర్ సర్పంచ్‌గా చిట్యాల దేవేంద్ర విజయం

తంగళ్ళపల్లి మండలం ఇంద్రానగర్ గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చిట్యాల దేవేంద్ర ఘన విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి దొగ్గల పద్మపై దేవేంద్ర గెలుపొందారు. ఈ సందర్భంగా దేవేంద్ర మాట్లాడుతూ.. ఈ గెలుపు తన వ్యక్తిగత విజయంగా కాకుండా ఇంద్రానగర్ గ్రామ ప్రజలందరి విజయంగా భావిస్తున్నానన్నారు. తనపై నమ్మకం ఉంచి ఆదరించిన గ్రామస్థులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


