News December 2, 2025

తిరుమల: డిప్‌లో వచ్చిన రాష్ట్రాల వివరాలు ఇవే..!

image

వైకుంఠ ద్వార దర్శనం 3 రోజులకు డిప్‌లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ డిప్‌లో రాష్ట్రాల వారీగా చూస్తే.. ఆంధ్రప్రదేశ్ 58,923, తెలంగాణ 41,965, తమిళనాడు 11,703, కర్ణాటక 20,929, మహారాష్ట్ర 3,352, పాండీచరీ 181, ఒడిస్సా 180, గుజరాత్ 114, త్రిపుర 29, కేరళ 287, రాజస్థాన్ 46, వెస్ట్ బెంగాల్ 50 భక్తులకు లభించింది.

Similar News

News February 16, 2026

నిజమాబాద్‌కు మంత్రులు ఉత్తమ్ కుమార్, సీతక్క

image

నేడు జరగనున్న నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క నగరానికి రానున్నారు. తొలుత కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేస్తారు. తర్వాత మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి ప్రత్యేక సమావేశానికి హాజరు కానున్నారు. MIM కార్పోరేటర్‌లతో కలిసి కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని హస్తగతం చేసుకోనున్న సంగతి తెలిసిందే.

News February 16, 2026

సిద్దిపేట: నేడు ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. ప్రజలు కలెక్టర్ కార్యాలయానికి రావద్దని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఛైర్మన్ల ఎంపిక కార్యక్రమంలో అధికారులు పాల్గొంటున్న నేపథ్యంలో ప్రజావాణిని నిలిపివేస్తున్నామన్నారు.

News February 16, 2026

పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా రాత్రుళ్లే ఎందుకు?

image

పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా రాత్రి వేళ లేదా తెల్లవారుజామునే ఉంటాయి. అందుకు ప్రధాన కారణం అరుంధతీ నక్షత్ర దర్శనం. ఆకాశంలో దర్శనమిచ్చే అరుంధతి, వశిష్ఠుల జంట అన్యోన్యత, పాతివ్రత్యానికి ప్రతీక. వారిలా వధూవరులు నూరేళ్లు వర్ధిల్లాలని పురోహితులు ఈ నక్షత్రాన్ని చూపిస్తారు. ఈ నక్షత్రం అర్థరాత్రి/తెల్లవారుజామునే కనిపిస్తుంది. అందుకే ఆ నక్షత్ర దర్శనం సాధ్యమయ్యే సమయాల్లోనే ముహూర్తాలు నిర్ణయిస్తారు.