News December 2, 2025

తిరుమల తరహాలో అన్ని చోట్లా..: సింఘాల్

image

AP: తిరుమల తరహాలో TTD పరిధిలోని ఆలయాల్లో రుచికరంగా అన్నప్రసాదాలు అందజేస్తామని TTD ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆ ఆలయాలలో అన్నప్రసాదాలు తయారు చేసే పోటు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సమీక్షలో అధికారులను ఆదేశించారు. TTDలో ఇంకా ఎవరైనా అన్య మతస్తులు ఉంటే వారిని గుర్తించి తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. అమరావతిలోని వేంకటేశ్వరుడి ఆలయ విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News February 14, 2026

మోదీపై నమ్మకంతో కరీంనగర్‌లో గెలిపించారు: బండి సంజయ్

image

TG: మోదీపై నమ్మకంతో ప్రజలు కరీంనగర్‌లో బీజేపీని గెలిపించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు. హామీలిచ్చి నెరవేర్చని కాంగ్రెస్‌కు ఓటర్లు గుణపాఠం చెప్పారని అన్నారు. జీహెచ్ఎంసీని ఒవైసీ కుటుంబం, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల ఆస్తుల మాదిరి పంచుకున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 3 కార్పొరేషన్లనూ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

News February 14, 2026

టెన్త్ పరీక్షలు రాయనున్న వైభవ్ సూర్యవంశీ

image

సంచలన ఆటతో U19 WC గెలుపులో <<19068083>>కీలక పాత్ర<<>> పోషించిన వైభవ్ సూర్యవంశీ ఇక పరీక్షలపై ఫోకస్ పెట్టనున్నారు. ఈ నెల 17 నుంచి జరిగే CBSE పదో తరగతి ఎగ్జామ్స్ రాయనున్నారు. ఈ మేరకు అతడికి అడ్మిట్ కార్డు అందజేసినట్లు పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్(బిహార్) ప్రిన్సిపల్ నీల్ కిశోర్ సిన్హా తెలిపారు. పరీక్షా హాలులో సాధారణ విద్యార్థి మాదిరే వైభవ్‌నూ చూస్తామని స్పష్టం చేశారు.

News February 14, 2026

OFFICIAL: నిజామాబాద్ కార్పొరేషన్‌లో హంగ్

image

TG: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో హంగ్ ఏర్పడింది. అక్కడి 60 డివిజన్లలో బీజేపీ 28, కాంగ్రెస్-17, MIM-14 స్థానాలు దక్కించుకున్నాయి. బీఆర్ఎస్ ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంది. మేయర్ పీఠం అధిష్ఠించడానికి (మ్యాజిక్ ఫిగర్‌ 31) బీజేపీ 3 సీట్ల దూరంలో నిలిచింది. కాంగ్రెస్, MIM కలిస్తే మేయర్ పీఠం వారి సొంతమవుతుంది. అటు కొత్తగూడెం, కరీంనగర్ కార్పొరేషన్లలోనూ హంగ్ ఏర్పడిన విషయం తెలిసిందే.