News March 23, 2025

తిరువూరు: ప్రమాదంలో తల్లీ, కొడుకు మృతి

image

తిరువూరుకు చెందిన తల్లీ, కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు భద్రాది జిల్లాలో దమ్మపేట (M) గాంధీనగర్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వస్తున్న తల్లీ, కుమారుడు స్పాట్‌లోనే మృతి చెందారు. మృతులు తిరువూరు (M) ముష్టికుంట్లకు చెందిన సరస్వతి (70), కృష్ణ (54)గా గుర్తించారు. బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.

Similar News

News April 21, 2025

బీటెక్, MBA చేసినా నిరుద్యోగులుగానే!

image

భారతదేశంలో గ్రాడ్యుయేట్ల పరిస్థితిపై ‘అన్‌స్టాప్’ నివేదిక విడుదల చేసింది. దాదాపు 83% మంది ఇంజినీరింగ్ విద్యార్థులు, 50శాతం మంది MBA గ్రాడ్యుయేట్లు ఎలాంటి ఉద్యోగం, ఇంటర్న్‌షిప్ పొందలేదని తెలిపింది. 2024లో ఇంటర్న్‌షిప్ పొందిన వారిలోనూ నలుగురిలో ఒకరిని ఫ్రీగా పనిచేయించుకున్నట్లు పేర్కొంది. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే విధంగా విద్యా సంస్థలు కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

News April 21, 2025

జగిత్యాల: పోలీసు గ్రీవెన్స్‌కు 13 ఫిర్యాదులు

image

జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో నేడు గ్రీవెన్స్‌డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్పీ అశోక్ కుమార్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 13 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, సమస్యల పూర్తి వివరాలను సమర్పించాలన్నారు. ప్రతి కేసుపై విచారణ జరిపి తగినచర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.

News April 21, 2025

KMR: తేలనున్న 18469 మంది భవితవ్యం

image

TG రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం ఇంటర్ మీడియట్ పరీక్షల ఫలితాలను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేచిచూస్తున్నారు. ఈ ఏడాది జిల్లా నుంచి మొత్తం 18,469 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ప్రథమ సంవత్సరంలో 8743 మంది, ద్వితీయ సంవత్సరంలో 9726 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST

error: Content is protected !!