News October 5, 2025
తుని: గర్భిణి మృతి.. విచారణకు ఆదేశించిన కలెక్టర్

తుని ఏరియా ఆసుపత్రిలో గర్భిణి పి. రత్నకుమారి (29) మృతి ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని కలెక్టర్ షాన్‌మోహన్ సగిలి తెలిపారు. సిజేరియన్ ద్వారా ఇద్దరు శిశువులకు ఆమె జన్మనిచ్చింది. శస్త్రచికిత్స అనంతరం రక్తస్రావం పెరిగి, పరిస్థితి విషమించడంతో మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై జి.జి.హెచ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో విచారణకు కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News January 13, 2026
అన్నమయ్య: మద్యం బాటిల్స్‌పై రూ.10 పెంపు.!

అన్నమయ్య జిల్లాలో గతనెల 1,12,282 కేసుల లిక్కర్ (IML), 49,398 కేసుల బీరు తాగేశారు. డిసెంబర్‌లో మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి రూ.78.16 కోట్లు ఆదాయం వచ్చింది. న్యూ ఇయర్ సంబరాల్లో ఒక్కరోజులోనే జిల్లాలో 9216 కేసులు లిక్కర్, 3936 కేసులు బీరు తాగారు. ఆ ఒక్క రోజులోనే రూ.6.50 కోట్ల ఆదాయం లభించింది. ఈ పరిస్థితుల్లో రూ.99ల మద్యం, బీరు మినహా అన్ని బాటిళ్లపై రూ.10లు పెంచుతూ సోమవారం GO విడుదలైన విషయం తెలిసిందే.
News January 13, 2026
VMLD: బద్ది పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

వేములవాడలోని బద్ది పోచమ్మ తల్లి ఆలయానికి మంగళవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం భక్తులతో రద్దీగా మారింది. ఈ మేరకు భక్తులు ప్రీతికరమైన బోనాల నైవేద్యాలను, పసుపు కుంకుమలను అమ్మవారికి సమర్పించుకున్నారు. అందరిని చల్లగా చూడు తల్లి అంటూ బద్ది పోచమ్మ తల్లిని వేడుకున్నారు. మేడారం జాతర సందర్భంగా మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.
News January 13, 2026
పప్పు గింజల పంటల్లో చిత్త పురుగులు.. నివారణ

మినుము, పెసర, అలసంద, కంది లాంటి పప్పు గింజల పైర్లు లేత దశలో(2-4 ఆకులు) ఉన్నప్పుడు చిత్త/పెంకు పురుగులు ఆశిస్తాయి. ఆకుల అడుగు భాగాల్లో చేరి రంధ్రాలు చేసి తినేస్తాయి. దీంతో మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. వీటి నివారణకు కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 5గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5ML మందులతో విత్తనశుద్ధి చేసుకోవాలి. పంటలో లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6ML లేదా ఎసిఫేట్ 1.5గ్రా. కలిపి పిచికారీ చేసుకోవాలి.


