News March 6, 2025
తుని: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 35 మందికి జరిమానాలు

తుని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన 35 మందికి తుని జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు భారీ జరిమానా విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు. కోర్టు తీర్పు ప్రకారం.. ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం ₹3,50,000 జరిమాన విధించినట్లు రూరల్ ఎస్ఐ కృష్ణమాచార్యులు తెలిపారు. వాహనదారులు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఎస్ఐ కోరారు.
Similar News
News March 26, 2025
కొడాలి నాని ఆరోగ్యంపై స్పందించిన ఆయన టీమ్

AP:వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై వచ్చిన వార్తల విషయంలో ఆయన టీమ్ ట్విటర్లో స్పందించింది. ‘కొడాలి నాని గారు గ్యాస్ట్రిక్ సమస్యతో ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన క్షేమంగా ఉన్నారు’ అని వెల్లడించింది. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు ఉదయం ఆయనకు గుండెపోటంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
News March 26, 2025
ధరణిని బంగాళాఖాతంలో వేయాలనే ప్రజలు అధికారం ఇచ్చారు: భట్టి

TG: ఒక్క కలం పోటుతో భూమిపై హక్కులు లేకుండా చేసిన దుర్మార్గమైన చట్టమే ధరణి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. అలాంటి ధరణిని బంగాళాఖాతంలో వేయాలనే ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. అందుకే దాన్ని బంగాళాఖాతంలో వేసి, భూభారతి తెచ్చామని పేర్కొన్నారు. అనేక చట్టాలు, పోరాటాల ద్వారా వచ్చిన భూహక్కులను బీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాసిందని భట్టి మండిపడ్డారు.
News March 26, 2025
గంభీర్.. ద్రవిడ్‌ని అనుసరించాలి కదా?: గవాస్కర్

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన అనంతరం టీమ్ ఇండియాకు BCCI రూ.58కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. గంభీర్‌కు రూ.3కోట్లు, సపోర్ట్ స్టాఫ్‌కు రూ.50లక్షలు లభించనున్నాయి. దానిపై గవాస్కర్ ప్రశ్నించారు. ‘T20 వరల్డ్ కప్ విజయం అనంతరం ద్రవిడ్ బోర్డు ఇచ్చిన డబ్బును తిరస్కరించారు. సిబ్బందితో సమానంగా ఇవ్వాలని కోరారు. కానీ ఇప్పుడు గంభీర్ మాత్రం ఏమీ మాట్లాడలేదు. ద్రవిడ్‌ను అనుసరించాలి కదా?’ అని ప్రశ్నించారు.