News December 1, 2025
తుఫాను నేపథ్యంలో తిరుపతి ఎస్పీ భద్రత సూచనలు

దిత్వా తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. అరణియార్ రిజర్వాయర్‌లో నీటి మట్టం 1.6 TMCకు చేరుకోవడంతో పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. వాగులు, వంకలు, బ్రిడ్జిల వద్దకు వెళ్లరాదని, ప్రవాహ ప్రాంతాల్లో వాహనాలు నడపవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 8099999977 లేదా 112కు కాల్ చేయాలని ప్రజలను కోరారు.
Similar News
News February 12, 2026
ఇలాంటి నాయకుడు కావాలి సర్!

ఆప్ ఎంపీ, యువ నేత <<19108486>>రాఘవ్ సింగ్ చద్ధా<<>> పార్లమెంటులో లేవనెత్తుతున్న సమస్యలు దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆహార కల్తీ, ధరలు, ప్రజా సంక్షేమం, పన్నుల మోత.. ఇలా సామాన్యుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈయన వల్లే 10 నిమిషాల డెలివరీ, గిగ్ వర్కర్ల సమస్యలు దేశానికి తెలిశాయి. కార్పొరేట్ ట్యాక్స్ కంటే వ్యక్తులు చెల్లించే ఆదాయపు పన్ను ఎక్కువగా ఉందని వేతన జీవుల కష్టాన్ని తెలియజేశారు.
News February 12, 2026
ఒమన్‌పై లంక ఘన విజయం

T20WCలో ఒమన్‌పై శ్రీలంక 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత శ్రీలంక 225/5 స్కోర్ చేసింది. కుశాల్ మెండిస్(61), పవన్(60), దసున్ శనక(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. 226 రన్స్ టార్గెట్‌తో బరిలో దిగిన ఒమన్ 120/9 స్కోరుకే పరిమితమైంది. ఈ విజయంతో గ్రూప్-Bలో లంక(4 పాయింట్లు) అగ్రస్థానానికి చేరుకుంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలిచిన విషయం తెలిసిందే.
News February 12, 2026
సంగారెడ్డి: ఈనెల 17 నుంచి ఫ్రీ ఫైనల్ పరీక్షలు

సంగారెడ్డి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈనెల 17 నుంచి 24 వరకు పదో తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు మండల వనరుల కేంద్రాల నుండి ప్రశ్నపత్రాలను సేకరించాలని సూచించారు. వార్షిక పరీక్షలకు ముందు విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు పరీక్షలు దోహదపడతాయన్నారు.


