News December 1, 2025

తుఫాను నేపథ్యంలో తిరుపతి ఎస్పీ భద్రత సూచనలు

image

దిత్వా తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. అరణియార్ రిజర్వాయర్‌లో నీటి మట్టం 1.6 TMCకు చేరుకోవడంతో పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. వాగులు, వంకలు, బ్రిడ్జిల వద్దకు వెళ్లరాదని, ప్రవాహ ప్రాంతాల్లో వాహనాలు నడపవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 8099999977 లేదా 112కు కాల్ చేయాలని ప్రజలను కోరారు.

Similar News

News February 9, 2026

అనంత: 40 ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు!

image

గుంతకల్లు ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1983-86 బ్యాచ్ బీకాం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. 40 ఏళ్ల తర్వాత కలుసుకున్న విద్యార్థులు తమ పాత అధ్యాపకులను సన్మానించారు. కళాశాల అభివృద్ధి కోసం రూ.లక్ష విరాళం ప్రకటించి, ప్రిన్సిపల్‌ డాక్టర్ ఏ.లక్ష్మయ్యకు అందజేశారు. సుమారు 100 మందికి పైగా విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

News February 9, 2026

మామిడిలో బోరాన్, పొటాష్ లోపాన్ని ఎలా గుర్తించాలి?

image

మామిడిలో బోరాన్ లోపం వల్ల చెట్ల ఆకులు కురచగా మారి ఆకుకొనలు నొక్కుకుపోయి పెళుసుగా మారతాయి. కాయలపై పగుళ్లు ఏర్పడతాయి. దీని నివారణకు ప్రతి మొక్కకు 100గ్రా. బోరాక్స్ భూమిలో వేయాలి. లేదా లీటరు నీటికి 1ml-2ml బోరాక్స్ లేదా బోరికామ్లం కొత్త చిగురు వచ్చినప్పుడు 1-2 సార్లు పిచికారీ చేయాలి. ఆకుల అంచులు ఎండిపోతే పొటాష్ లోపంగా గుర్తించాలి. దీని నివారణకు లీటరు నీటికి 13:0:45 10గ్రా. కలిపి పిచికారీ చేయాలి.

News February 9, 2026

కేంద్ర ప్రభుత్వ న్యాయవాదుల ఫీజులు పెంపు

image

దేశంలోని కోర్టుల్లో కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదుల ఫీజును న్యాయశాఖ పెంచింది. రెగ్యులర్ అప్పీళ్లకు హాజరై, తుది విచారణ వరకు వాదనలు వినిపించే గ్రూప్-ఏ న్యాయవాదులకు ఒక కేసుకు ఫీజు రూ.13,500 ఉండగా రూ.21,600 చెల్లించనుంది. గ్రూప్-బీ, సీ న్యాయవాదులకు రూ.9వేల నుంచి రూ.14,400 ఇవ్వనుంది. 11 ఏళ్ల తర్వాత ఈ ఫీజులు పెంచడం గమనార్హం.