News December 1, 2025
తుఫాను లేటెస్ట్ అప్‌డేట్

దిత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడిందని, రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనుందని APSDMA పేర్కొంది. రేపు దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని, సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు.
Similar News
News February 17, 2026
ములుగు: అంతరాయం లేని విద్యుత్ అందించాలి

ములుగులో TGNPDCL ఆపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్ ములుగు సర్కిల్ విద్యుత్ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. వేసవిలో అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించాలని అధికారులకు సూచించారు. రంజాన్ దృష్ట్యా మసీదులు, దర్గాలకు నిరంతర విద్యుత్ ఇవ్వాలన్నారు. 33కెవి ఇంటర్‌లింక్ పనులు మార్చిలోగా పూర్తి చేసి ట్రాన్స్ఫార్మర్ లోడ్ పెంపు, కొత్త ట్రాన్స్ఫార్మర్లు, రైతు కనెక్షన్లు త్వరగా ఇవ్వాలని ఆదేశించారు.
News February 17, 2026
భారత్‌తో ఓటమి.. నఖ్వీ కోపానికి పాక్ కోచ్ బలి?

టీమ్‌ఇండియా చేతిలో ఓటమి తర్వాత పాక్ కోచ్ మైక్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. కొలంబోలోని ప్రసిద్ధ ‘క్రికెట్ క్లబ్ కేఫ్’లో ఆయన కనిపించిన దృశ్యాలు SMలో వైరలవుతున్నాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్‌పై PCB ఛైర్మన్ నఖ్వీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. రేపు నమీబియాతో మ్యాచ్‌లో పాక్ ఓడిపోతే ఆ జట్టు ఇంటికెళ్లాల్సిందే. ఈ తరుణంలో కేఫ్‌లో మైక్ కనిపించడం చర్చకు దారితీసింది.
News February 17, 2026
బంగ్లా ప్రధానిగా తారిఖ్ ప్రమాణం.. భేటీ అయిన ఓం బిర్లా

బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా BNP చీఫ్ తారిఖ్ రెహ్మాన్ ఢాకాలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి భారత్ నుంచి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి ముందు తారిఖ్‌తో బిర్లా ప్రత్యేకంగా సమావేశమై భారత్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 297 సీట్లకు గాను ఆ పార్టీ 209 చోట్ల గెలిచిన విషయం తెలిసిందే.


