News November 8, 2025

తుళ్లూరు: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

తుళ్లూరు(M) ఐనవోలు టిడ్కో ఇళ్లలో నివాసం ఉంటున్న చిలకా కోటేశ్వరావు(26) అనే వ్యక్తి శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సత్తెనపల్లికి చెందిన మృతుడు మందడంలోని పని చేస్తూ ఏడాది నుంచి టిడ్కోలో అద్దెకు ఉంటున్నాడు. భార్యతో మనస్పర్థలు రావడంతో ఇంటిలో భార్య ఉండగానే తలుపు గడియ వేసుకొని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు SI కలగయ్య తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News January 23, 2026

కలికిరి: ఎల్లుండి మాజీ సీఎం రాక

image

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈనెల 25న కలికిరికి రానున్నారు. ఉదయం 11గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి మ.12:30 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. 12:45 గంటలకు చంద్రగిరి మండలం మామండూరులో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:45 గంటలకు బయలుదేరి కలికిరి బీజేపీ కార్యాలయానికి సాయంత్రం 3:15గంటలకు చేరుకుంటారు. 26న కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు.

News January 23, 2026

అనకాపల్లి: ‘జాతీయ హరిత ట్రిబ్యునల్ మార్గదర్శకాలను పాటించాలి’

image

జాతీయ హరిత ట్రిబ్యునల్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. శుక్రవారం అనకాపల్లి కలెక్టరేట్‌లో హరిత ట్రిబ్యునల్ జిల్లాస్థాయి కమిటీ మొదటి సమావేశం నిర్వహించారు. నగరాల్లో చెత్త సేకరణను పక్కాగా అమలు చేయాలన్నారు. మురికి కాలవల్లో నీరు మంచినీటి వనరుల్లో కలవకుండా చూడాలన్నారు. భూగర్భ జలాలు కలుషితం కాకుండా మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిర్మించాలన్నారు.

News January 23, 2026

ల్యాండ్ రికార్డులను బ్లాక్ చైన్ టెక్నాలజీతో డిజిటలైజ్ చేయాలి: SC

image

దేశంలో బలహీనమైన ల్యాండ్ రికార్డుల వ్యవస్థతో భూ వ్యాజ్యాలు పెరిగిపోతున్నాయని SC వ్యాఖ్యానించింది. ల్యాండ్ రికార్డులు ట్యాంపర్‌కు ఆస్కారం లేని విధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీతో డిజిటలైజ్ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. మోడ్రన్ ఎకానమీలో ప్రాపర్టీ టైటిల్స్ శాంక్టిటీతో ఉండాలని జస్టిసులు రాజేశ్ బిందాల్, మన్మోహన్ అభిప్రాయపడ్డారు. రిజిస్టర్డ్ డాక్యుమెంటు లాంఛనం కాదని ఓకేసులో పేర్కొన్నారు.