News August 21, 2025
తుళ్లూరు పోలీస్ స్టేషన్ అంటే పోలీసులకే భయం

ప్రజలు సాధారణంగా పోలీస్ స్టేషన్ అంటే భయపడతారు, కానీ గుంటూరు జిల్లాలో తుళ్లూరు పోలీస్ స్టేషన్ అంటే ఏకంగా పోలీస్ సిబ్బందే భయపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ స్టేషన్ పరిధిలో సచివాలయం, హైకోర్టు ఉండటం వల్ల ఇక్కడ విధులు నిర్వహించడం అంటే వెట్టిచాకిరితో సమానమని అంటున్నారు. అంతేకాకుండా, ఈ ప్రాంతంలో కేవలం 10% మాత్రమే HRA వస్తుందని, చుట్టుపక్కల స్టేషన్లలో 16% వస్తుందని సిబ్బంది చెబుతున్నారు.
Similar News
News January 19, 2026
గణతంత్ర వేడుకలకు సిద్దం కావాలి: కలెక్టర్

గణతంత్ర వేడుకలకు సిద్ధం కావాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. 77వ గణతంత్ర వేడుకల పై సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సమీక్షించారు. రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలు తుళ్లూరు మండలం రాయిపూడిలో జరుగుతున్నాయన్నారు. ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. సీఆర్డీఏ, శాఖల ప్రధాన కార్యాలయాలతో సమన్వయం చేసుకోవాలని అన్నారు.
News January 19, 2026
GNT: ఈ-క్రాప్‌కు కొత్త నిబంధనలు.. రైతులకు ఊరట

గుంటూరు జిల్లాలో రైతులకు అందే ప్రభుత్వ ప్రయోజనాలకు ఈ-క్రాప్ కీలకంగా మారింది. గత ప్రభుత్వంలో నమోదు సరిగా కాక చాలామంది రైతులు నష్టపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ-క్రాప్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. రబీ నుంచి కొత్త మార్గదర్శకాలు అమలు చేస్తోంది. రైతు సమక్షంలోనే పొలంలో నమోదు చేయాలని ఆదేశించింది. సాగు భూమితో పాటు ఖాళీ భూములను కూడా ల్యాండ్ పార్శిల్‌గా నమోదు చేస్తున్నారు.
News January 18, 2026
రెవెన్యూ క్లినిక్‌లు ప్రజలు వినియోగించుకోవాలి: కలెక్టర్

జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రెవెన్యూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించేందుకు జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం, కలెక్టరేట్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలోని రెవెన్యూ అధికారులందరూ భూ రికార్డులతో హాజరవుతారన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.


