News March 13, 2025
తుళ్లూరు: మైక్రోసాఫ్ట్‌తో లోకేశ్ కీలక ఒప్పందం

రాష్ట్రంలోని యువతకు ఎఐ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం మైక్రోసాఫ్ట్‌తో ఎపీ ప్రభుత్వం కీలకమైన ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో గురువారం మంత్రి లోకేశ్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎంఓయుపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఏడాది వ్యవధిలో 2లక్షల మంది యువతకు మైక్రోసాఫ్ట్ సంస్థ స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇస్తుందని లోకేశ్ తెలిపారు.
Similar News
News February 18, 2026
60 రోజుల్లోగా చార్జ్‌షీట్లు దాఖలు చేయాలి: ఎస్పీ

గుంటూరు జిల్లాలో నమోదైన క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేయాలని SP వకుల్ జిందాల్ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. 60 నుంచి 90 రోజులలోపు చార్జ్ షీట్లను న్యాయస్థానంలో దాఖలు చేయాలన్నారు. ఆస్తి నేరాల నివారణకు సీసీ కెమెరాల ఏర్పాటు, రాత్రి గస్తీని బలోపేతం చేయాలని సూచించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
News February 18, 2026
గుంటూరు: కాంట్రాక్టర్లపై క్రిమినల్ చర్యలకు కలెక్టర్ ఆదేశాలు

ఇళ్ల నిర్మాణాల్ని మధ్యలోనే ఆపేసిన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారీయా అధికారులను ఆదేశించారు. ఉగాది నాటికి జిల్లాలో 22,952 గృహాల లక్ష్యం పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీలో పనులు చేసుకోవచ్చన్నారు. బిల్లుల చెల్లింపు వెంటనే జరుగుతుందని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు.
News February 18, 2026
పోక్సో కేసులో అసెంబ్లీ ASO మునిరాజా అరెస్ట్

AP అసెంబ్లీ ఉద్యోగి ASO మునిరాజా తండ్రిలా దరిచేరి బాలికపై అత్యాచారయత్నం చేశాడు. లైంగిక దాడి, కుల దూషణ కేసులో అరెస్ట్ చేసినట్లు నున్న పోలీసులు వెల్లడించారు. విజయవాడకు చెందిన భర్త లేని ఓ తల్లి, ఆమె కూతురిని 2 ఏళ్లుగా ఆర్థికంగా, మానసికంగా మునిరాజా వేధించడం, బాలిక దుస్తుల మార్చుకునే దృశ్యాలు చిత్రీకరించినట్లు విచారణలో తేలింది. ఈయన వెలగపూడిలోని AP అసెంబ్లీలో పనిచేస్తూ తాడేపల్లిలో నివాసం ఉంటున్నాడు.


