News September 11, 2025
తూర్పులో కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్

తూర్పుగోదావరి జిల్లాలో డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు గత రాత్రి 462 వాహనాలను తనిఖీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 9 మందిపై, బహిరంగంగా మద్యం తాగుతున్న 140 మందిపై కేసులు నమోదు చేశారు. రికార్డులు లేని 42 వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News December 8, 2025
రాజమండ్రి: నేడు PGRS కార్యక్రమం

డిసెంబర్ 8న (సోమవారం) జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ నుంచి సచివాలయాల వరకు PGRS కార్యక్రమం యథాతథంగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పౌర సేవల కోసం వాట్సాప్ నంబర్ 95523 00009 అందుబాటులో ఉందని తెలిపారు. ఫిర్యాదుదారులు దీనిని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.

News December 7, 2025
రౌడీషీటర్లకు ఎస్పీ హెచ్చరిక

తూర్పుగోదావరి ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాలతో ఆదివారం జిల్లావ్యాప్తంగా రౌడీషీటర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్‌హెచ్‌ఓల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేరస్తుల ప్రవర్తనపై ఆరా తీశారు. అందరూ సత్ప్రవర్తనతో మెలగాలని, మళ్లీ చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాల్లో భాగస్వాములైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.