News August 19, 2024

తూ.గో.: అశ్లీల నృత్యాలు.. ఐదుగురు అరెస్ట్

image

తూ.గో. జిల్లా నల్లజర్ల మండలం గంటావారిగూడెం శివారు తోటలో అశ్లీల నృత్యాలు నిర్వహించిన కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని CI శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. నిందితులు సురేష్ బాబు, యువరాజు, సుబ్బారావు, దుర్గాప్రసాద్, దుర్గా శ్రీనివాసులను రిమాండ్ కు తరలించామని చెప్పారు. ప్రధాన నిందితుడు సురేష్ బాబుపై ఇప్పటికే పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదు అయ్యాయన్నారు.

Similar News

News September 7, 2024

తూ.గో.: ఫ్రెండ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

image

తూ.గో. జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు <<14036102>>మృతిచెందిన<<>> విషయం తెలిసిందే. వివరాలు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రవీణ్, పల్నాడు జిల్లాకు చెందిన కార్తిక్ రాజమండ్రిలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. సెమిస్టర్ పరీక్షలకు చదువుకునేందుకు ఫ్రెండ్ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రవీణ్‌కు గుండెలో నొప్పిరావడంతో అందరూ కలిసి రాజమండ్రిలోని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు బయలుదేరగా యాక్సిడెంట్ జరిగింది.

News September 7, 2024

కాకినాడ: 11న ప్రైమినిస్టర్ నేషనల్ అప్రెంటిస్ మేళా

image

కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 11వ తేదీన ప్రైమినిస్టర్ నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల వర్మ తెలిపారు. ఉమ్మడి తూ.గో జిల్లాలో ప్రభుత్వ & ప్రైవేట్ ఐటీఐ పూర్తి చేసి NTC సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు హాజరు కావచ్చని అన్నారు. ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు వచ్చి తమకు కావలసిన అప్రెంటిస్లను ఎంపిక చేసుకుంటారన్నారు.

News September 7, 2024

రాజమండ్రిలో చిరుత

image

రాజమండ్రి అటవీప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. హౌసింగ్ బోర్డు కాలనీ, పుష్కరవనం మధ్యలో అటవీశాఖ సిబ్బంది నివాసాలు ఉన్న ప్రాంతంవైపు శుక్రవారం వేకువజామున చిరుత ఓ జంతువును నోటకరిచి రోడ్డు దాటింది. దీనిని స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారమిడంతో వారు పాదముద్రలు సేకరించారు. చిరుత సంచరించిన ప్రాంతంలో 6 ట్రాప్ కెమెరాలను ఏర్పాటుచేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.