News August 21, 2025

తూ.గో జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

గోదావరి వరదల నేపథ్యంలో రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్, కొవ్వూరు, రాజమండ్రి ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పి.ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర పరిస్థితులలో ప్రజలు జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 8977935611, రాజమండ్రి డివిజన్ 0883-2442344, కొవ్వూరు డివిజన్ 08813-231488, మునిసిపల్ కార్పొరేషన్ 9494060060 కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించాలన్నారు.

Similar News

News January 23, 2026

తూ.గో జిల్లా అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

తూర్పుగోదావరి జిల్లాల్లోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ మొదటి ఏడాది సీట్ల భర్తీకి దరఖాస్తులను తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 19లోపు https://apbragcet.apcfss.in వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 1, 2 తేదీల్లో ప్రవేశ పరీక్షలు ఉంటాయి.

News January 23, 2026

తూ.గో. జిల్లాలో కలిసిన 4 పోలీస్ స్టేషన్‌లు

image

జిల్లాల పునర్విభజనలో భాగంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గాన్ని తూ.గో జిల్లాలో విలీనం చేస్తూ కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి. దీని ప్రకారం రామచంద్రాపురం సబ్ డివిజన్ పరిధిలోని మండపేట టౌన్, రూరల్, అంగర, రాయవరం పోలీస్ స్టేషన్లు రాజమహేంద్రవరం తూర్పు మండలం పరిధిలోకి వచ్చాయి. అలాగే, తూర్పు మండలంలోని బొమ్మూరు స్టేషన్‌ను దక్షిణ మండలానికి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

News January 23, 2026

రాజమండ్రిలో ఎస్పీ నేర సమీక్షా సమావేశం

image

జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ గురువారం పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. PGRS ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించాలని, మహిళల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని, రౌడీ షీటర్ల కార్యకలాపాలపై నిఘా ఉంచాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు.