News February 10, 2025

తూ.గో: నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

image

తూ.గో.జిల్లాలో సోమవారం నుంచి 14వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్ ఆర్‌ఐవో నరసింహం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 77 సెంటర్లలో ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయన్నారు. మొదటి విడత ఈ నెల 10, 11, 12, 13, 14 తేదీల్లో 58 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఆయా సెంటర్లలో సీసీ కెమెరాల నిఘా ఉంటుందన్నారు. పరీక్షల పర్యవేక్షణకు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News February 16, 2026

రాజమండ్రి: పోలీస్ పీజీఆర్ఎస్‌కు 24 ఫిర్యాదులు

image

రాజమండ్రిలోని తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 24 మంది తమ అర్జీలను దాఖలు చేశారు. ఎస్పీ నరసింహ కిషోర్ బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. సమస్యల పరిష్కారంపై సంబంధిత స్టేషన్లకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. చట్టపరిధిలో బాధితులకు న్యాయం జరిగేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

News February 15, 2026

రాజమండ్రి: గమనిక.. రేపు రెవెన్యూ క్లినిక్‌లు రద్దు

image

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని తదుపరి రోజూ 16న రాష్ట్ర ప్రభుత్వం ఐచ్చిక సెలవు ప్రకటించిన దృష్ట్యా జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహించాల్సిన PGRS/ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులు అందజేయడానికి సంబంధిత కార్యాలయాలకు రావద్దని అర్జీదారులను కోరారు. తదుపరి సోమవారం నుండి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు.

News February 14, 2026

ఏపీని ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: కందుల

image

సీఎం నారా చంద్రబాబు దిశానిర్దేశంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక బడ్జెట్ రాష్ట్ర పురోగతికి బాటలు వేసేలా ఉందని మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. శనివారం అమరావతిలో ఆయన మాట్లాడారు. పర్యాటక, సాంస్కృతిక రంగాలకు బడ్జెట్‌లో రూ.439 కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది సమగ్రమైన బడ్జెట్ అని రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చి పురోగమన దిశలో వెళ్తుందన్నారు.