News May 13, 2024

తూ.గో: నేడే పోలింగ్.. ఈ నంబర్స్ గుర్తుంచుకోండి

image

తూ.గో జిల్లాలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు.
☞ జిల్లాలో మొత్తం ఓటర్లు- 16,23,149 మంది
☞ పోలింగ్ కేంద్రాలు- 1,577
☞ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు- 375
☞ పోలింగ్ రోజు ఎక్కడైనా సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్- 18904252540
☞ ఓటర్లకు సంబంధించిన సమాచారం కోసం నంబర్- 1950

Similar News

News December 15, 2025

తూ.గో: ఒక రోజు ముందే పెన్షన్ పంపిణీ

image

పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. నూతన సంవత్సరంలో ఇవ్వాల్సిన పెన్షన్‌ను డిసెంబర్ 31వ తేదీ ఉదయం 7 గంటల నుంచే పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కార్యాలయం నుంచి ఆదివారం ప్రకటన వెలువడింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్‌ను అందజేయనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.

News December 14, 2025

రాజమండ్రి: టెట్ పరీక్షల్లో 129 మంది గైర్హాజరు

image

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ 2025) ఐదవ రోజు ఆదివారం ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి కె. వాసుదేవరావు తెలిపారు. రాజమండ్రి లూధర్ గిరి‌లో ఉన్న రాజీవ్ గాంధీ కళాశాలలో మొదటి షిఫ్ట్‌లో 955 మందికి 895 మంది హాజరయ్యారని, 60 మంది గైర్హాజరు అయ్యారన్నారు. మధ్యాహ్నం రెండవ షిఫ్ట్‌లో 700 మందికి 631 మంది హాజరైనట్లు, 69 మంది గైర్హాజరు అయినట్లు డీఈఓ వాసుదేవరావు తెలిపారు.