News January 19, 2026
తూ.గో: ‘పంచాయతీ, రెవెన్యూ శాఖలకే అధిక వినతులు’

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన PGRSకు మొత్తం 147 అర్జీలు వచ్చాయి. కలెక్టర్, జేసీ వై.మేఘా స్వరూప్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వచ్చిన అర్జీలలో రెవెన్యూ విభాగానికి(రెవెన్యూ క్లినిక్) 62, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధికి 59, హోంశాఖకు 9, వైద్యారోగ్య శాఖకు 17 దరఖాస్తులు అందాయి. ప్రజా ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News February 18, 2026
రాజమండ్రి: A2గా MLC అనంత బాబు భార్య.. కోర్టులో ఛార్జిషీట్!

ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసులు కీలక అడుగు వేశారు. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు భార్యను రెండో నిందితురాలిగా (A2) పేర్కొంటూ రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టులో తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేశారు. సుబ్రహ్మణ్యం హత్య ఘటన గతంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజా అఛార్జిషీట్‌తో ఈ కేసు విచారణలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది.
News February 18, 2026
రాజమండ్రి కోర్టుకి బాంబు బెదిరింపు

తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బుధవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. రాజమండ్రి, కరీంనగర్, అనంతపురం కోర్టులకు ఈ కాల్స్ రావడంతో పోలీసులు బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. రాజమండ్రి కోర్టులో న్యాయవాదులు, కక్షిదారులను బయటకు పంపించి ముమ్మరంగా గాలించారు. ఎక్కడా బాంబు ఆచూకీ లభించకపోవడంతో ఇది ఆకతాయిల పనిగా పోలీసులు భావిస్తున్నారు.
News February 18, 2026
వయోవృద్ధులకు ప్రత్యేక కార్యక్రమాలు: కలెక్టర్

తూర్పుగోదావరి జిల్లా వయోవృద్ధుల కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం తెలిపారు. ఫిబ్రవరి 21న ధవళేశ్వరంలోని శ్రీ గేదెల నూక రాజు కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. వృద్ధులు ఉత్పాదక జీవనం గడిపేలా వర్క్‌షాపులు నిర్వహిస్తామని, జిల్లాలోని వయోవృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.


