News February 15, 2025
తూ.గో: బర్డ్ ప్లూ లక్షణాలు ఎక్కడా లేవు: శాస్త్రవేత్తల బృందం

ఉమ్మడి జిల్లాలో పెరవలి మండలం మినహా ఎక్కడా బర్డ్ ప్లూ లక్షణాలు లేవని ..ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల స్పష్టం చేశారు. పారాల్లో పనిచేసే 28 మంది కార్మికుల నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా నెగటివ్ రిపోర్టు వచ్చిందన్నారు. 25 మంది వైద్యుల సమక్షంలో ఉన్నారన్నారు. కానూరు అగ్రహారంలో మూడు నెలలు పాటు ఆంక్షలు కొనసాగుతాయని కోళ్ల పెంపకం చేయకూడదన్నారు.
Similar News
News March 26, 2025
భారత ఎన్నికల వ్యవస్థపై ట్రంప్ ప్రశంసలు.. ఎందుకంటే!

భారత్ సహా కొన్ని వర్ధమాన దేశాల ఎన్నికల వ్యవస్థలను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఇకపై దేశంలో ఓటు హక్కు నమోదుకు పౌరసత్వ పత్రాలను చూపాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ‘స్వపరిపాలనలో అత్యున్నతంగా ఉన్నప్పటికీ ఎన్నికల భద్రతలో వర్ధమాన దేశాలతో పోలిస్తే US విఫలమైంది. భారత్, బ్రెజిల్ వంటివి బయోమెట్రిక్ డేటాబేస్ (ఆధార్)తో ఓటరు గుర్తింపును ముడిపెట్టాయి’ అని ఆయన వివరించారు.
News March 26, 2025
కల్వకుర్తి: KLI కాల్వ డైవర్షన్, గేట్ వాల్ పనులు చేపట్టాలని వినతి

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు నాలుగేళ్లుగా నత్త నడకన కొనసాగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ఆయన అసెంబ్లీలో ప్రస్తావించారు. వందల కిలోమీటర్లు కాల్వలు తవ్వినప్పటికీ వాటికి డ్రైవర్ సెన్స్, గేట్ వాల్స్ ఏర్పాటు చేయకపోవడంతో కృష్ణా జలాలు వృథాగా పోతున్నాయని ఆయన అన్నారు. మంత్రి వెంటనే స్పందించి ఈ వేసవిలో పనులు పూర్తి చేయించాలని కోరారు.
News March 26, 2025
అడుగుకు ‘రూపాయి పావలా’ కమీషన్ వసూలు: YCP

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై వైసీపీ మరోసారి సంచలన ఆరోపణ చేసింది. ‘నిన్న మొన్నటివరకు చికెన్ షాప్‌ల మీద పడి దండుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇప్పుడు పొగాకు గోదాములను కూడా వదలడం లేదు. అడుగుకు ‘రూపాయి పావలా’ చొప్పున తనకు రౌడీ మాములు ఇస్తే తప్ప అక్కడ పొగాకు నిల్వ చేయనివ్వమని హెచ్చరించారు. ఎమ్మెల్యే దిగజారుడుతనం చూసి వ్యాపారులు భీతిల్లుతున్నారు’ అంటూ ట్వీట్ చేసింది.