News June 19, 2024

తూ.గో: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్లు జైలు శిక్ష: సీఐ

image

రంపచోడవరానికి చెందిన మద్దికొండ సుధాకర్‌కు కాకినాడ పొక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5,000 జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు చెప్పిందని సీఐ వెంకటేశ్వరావు తెలిపారు. 2019లో అదే గ్రామానికి చెందిన ఒక బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి బలవంతంగా వైజాగ్ తీసుకెళ్లాడన్నారు. రేప్, కిడ్నాప్ కేసు నమోదు చేసి విచారించగా.. కోర్టులో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైందని వెల్లడించారు.

Similar News

News January 21, 2026

ధవళేశ్వరంలో ఒకరి మృతి.. నలుగురికి గాయాలు

image

ధవళేశ్వరం సాయిబాబా గుడి వద్ద నిర్మిస్తున్న పంపు హౌస్ స్లాబ్ నిర్మాణ పనులు చేపడుతుండగా ప్రమాదం సంభవించింది. స్లాబ్ వేస్తుండగా బుధవారం సెంట్రింగ్ కూలిపోయింది. దీంతో నిర్మాణపనులు చేస్తున్న కూలీల్లో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 20, 2026

22న రాజమండ్రిలో జాబ్ మేళా

image

రాజమండ్రి మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో జనవరి 22న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీష్ చంద్ర ప్రసాద్ మంగళవారం తెలిపారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై, 19 నుంచి 35 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. పలు ప్రముఖ కంపెనీలు ఈ ఇంటర్వ్యూల్లో పాల్గొంటాయన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News January 20, 2026

తూ.గో: వరకట్న వేధింపులు.. భర్తకు 18 నెలల జైలు శిక్ష

image

వరకట్న వేధింపుల కేసులో ముద్దాయి కరిముల్లాకు 18 నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ ఏజేఎఫ్‌సీ మెజిస్ట్రేట్ వీరరాఘవరావు మంగళవారం తీర్పునిచ్చారు. ధవళేశ్వరానికి చెందిన సయ్యద్ సమీన తబసుమ్‌ను అదనపు కట్నం కోసం భర్త వేధింపులకు గురిచేయడంతో 2012లో రాజమహేంద్రవరం మహిళా పీఎస్‌లో కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ అనంతరం నేరం నిరూపితం కావడంతో న్యాయస్థానం ఈ శిక్ష ఖరారు చేసింది.