News August 2, 2024

తూ.గో.: భారీ వర్షాలతో ఆక్వా రైతులకు కష్టాలు

image

భారీ వర్షాలు రొయ్యల సాగుకు ప్రతిబంధకంగా మారాయి. వర్షాలతో ఆక్సిజన్ అందక రొయ్యలు చనిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు బ్యాక్టీరియా, వైరస్ ఉద్ధృతి, వైట్ స్పాట్ రొయ్యల సాగుకు ప్రతికూలంగా పరిణమించాయి. కోనసీమ జిల్లాలో 14,400 హెక్టార్లలో, కాకినాడలోని 8,600 హెక్టార్లలో, తూ.గో. జిల్లాలోని 982 హెక్టార్లలో రొయ్యలు సాగు జరుగుతోంది. 3 జిల్లాల్లో కలిపి 28,596 మంది రైతులు ఆక్వాసాగు చేస్తున్నారు.

Similar News

News October 8, 2024

తూ.గో.జిల్లాకు రూ.100 కోట్ల నిధులు కేటాయింపు

image

2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని అఖండ గోదావరి ప్రాజెక్ట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జిల్లాకు రూ.100 కోట్ల నిధులను కేటాయించిందని టూరిజం అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాట్లకు, రాజమండ్రి నగరాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేయడానికి ఈ నిధులను వినియోగించనున్నారు. ఈ దిశగా సంబంధిత అధికారులు పనులు ప్రారంభించారు.

News October 8, 2024

పిఠాపురంలో బాలికపై అత్యాచారం.. YCP ట్వీట్

image

పిఠాపురంలో జరిగిన బాలిక అత్యాచార ఘటనపై YCP ‘X’ వేదికగా స్పందించింది. ‘దళిత బాలిక‌కు మాయమాటలు చెప్పి ఆటో‌లో తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆటోలో తరలించేందుకు యత్నిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డల మాన ప్రాణాలకి రక్షణ కరవైంది. సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ?’అంటూ పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేసింది.

News October 8, 2024

తూ.గో: నేటి నుంచి ప్రత్యేక రైళ్లు.. ఎప్పటివరకంటే?

image

శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని జిల్లా మీదుగా మంగళవారం నుంచి ఈ నెల 12 వరకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు రైల్వేశాఖ సోమవారం తెలిపింది. ఈ నెల 8,10,12 తేదీల్లో కాకినాడ-సికింద్రాబాద్, 9, 11 తేదీల్లో సికింద్రాబాద్-కాకినాడ రాకపోకలు సాగిస్తుందని చెప్పారు. ఈ రైళ్లు జిల్లాలోని సామర్లకోట, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.