News May 4, 2024
తూ.గో: మరో 8 రోజులే.. ఇక వారి ఓట్లే టార్గెట్!

పోలింగ్ తేదీ ముంచుకొస్తుండటంతో ఉమ్మడి తూ.గో జిల్లా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరి వ్యూహాల్లో వారున్నారు. ప్రతి ఓటు కీలకమేనంటూ వలస ఓటర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అమలాపురం పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి ఉపాధి నిమిత్తం వలస వెళ్లిన వారి వివరాలు సేకరిస్తూ వారితో టచ్‌లోకి వెళ్తున్నారట. పోలింగ్ రోజు ఓటేసేలా రైల్వే, ఆర్టీసీ, ప్రైవేటు బస్సులకు ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారు.
Similar News
News December 13, 2025
డిసెంబర్ 20 నుంచి RTC డోర్ డెలివరీ మాసోత్సవాలు: DPTO

ఈనెల 20 నుంచి జనవరి 19 వరకు APSRTC డోర్ డెలివరీ మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తూ.గో జిల్లా ప్రజా రవాణా అధికారి వై.ఎస్.ఎన్. మూర్తి శనివారం ప్రకటించారు. నగరాలలో 10 కి.మీ పరిధిలో 50 కేజీల వరకు పార్శిల్స్ డోర్ డెలివరీ జరుగుతుందన్నారు. తక్కువ ధరతో వేగంగా.. సురక్షితంగా మీ ఇంటి వద్దకు అందిస్తామని చెప్పారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఈ సౌకర్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్నారు.
News December 13, 2025
‘స్క్రబ్ టైఫస్’పై భయాందోళనలు వీడాలి- DMHO

‘స్క్రబ్ టైఫస్’పై ప్రజల్లో అపోహలు, భయాందోళనలు వద్దని DMHO డా. కె.వెంకటేశ్వర రావు స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 3 ‘స్క్రబ్ టైఫస్’ కేసులు మాత్రమే గుర్తించామనిని, అవి కూడా సాధారణ ఆరోగ్య పరీక్షలలో భాగంగా నిర్ధారణ అయినవేనని తెలిపారు. జిల్లాలో ఎక్కడా ‘స్క్రబ్ టైఫస్’ వ్యాప్తి పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. ‘స్క్రబ్ టైఫస్’ అనేది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపించే వ్యాధి కాదన్నారు.
News December 13, 2025
తూ.గో. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం తనిఖీ చేసిన SP

తూ.గో. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాన్ని SP డి.నరసింహ కిషోర్ శనివారం సందర్శించారు. త్వరలో స్టైపెండరీ క్యాడేట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ శిక్షణ కేంద్రంలో మౌలిక వసతుల కల్పన పనులు ఏవిధంగా జరుగుతున్నాయో పరిశీలించారు. ఎటువంటి అంతరాయం లేకుండా పనులు వేగవంతం కావాలని ఆయన ఆదేశించారు. తాగునీరు, వైద్య సదుపాయాలు, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు.


