News April 1, 2024

తెగిపోయిన నిజాంసాగర్ కట్ట.. జర్నలిస్ట్ కాలనీలోకి నీళ్లు

image

ఆర్మూర్‌లోని నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ 82-2 కో నంబర్ ప్రధాన కాలువ కట్ట సోమవారం తెల్లవారుజామున తెగిపోయింది. దీంతో కాలువను ఆనుకుని ఉన్న జర్నలిస్ట్ కాలనీలోకి భారీగా నీరు వచ్చి చేరింది. నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా రైతుల పంటల సాగు కోసం నీటిని చెరువులకు వదిలే సమయంలో ప్రాజెక్టు ప్రధాన కాలువలను ఇరిగేషన్ అధికారులు శుభ్రం చేయకపోవడంతో ఈ సమస్య ఏర్పడిందని కాలనీవాసులు పేర్కొన్నారు.

Similar News

News February 7, 2026

NZB: పోరు బరిలో బంధువులు, కుటుంబీకులు..

image

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో బంధువులు పోటీ పడుతున్నారు. ఒకే పార్టీ నుంచి భార్యా మరొకచోట నుంచి భర్త, ఒకే పార్టీ నుంచి తండ్రి ఒక చోట నుంచి కూతురు ఒక చోట, పక్కపక్కనే గల డివిజన్లో అన్నదమ్ముల కూతుర్లు అక్కాచెల్లెళ్లు కూడా ఒకే పార్టీ నుంచి పక్కపక్కనే గల డివిజన్ల నుంచి పోటీ చేస్తున్నటువంటి సన్నివేశం ఆసక్తికరంగా మారింది.

News February 7, 2026

NZB: ముఖ్యమంత్రి పర్యటనతో కాంగ్రెస్ అభ్యర్థుల్లో జోష్

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నిజామాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ కార్పోరేటర్ అభ్యర్థుల్లో జోష్ నింపింది. సభకు ముందు CM పోటీ పడుతున్న అభ్యర్థులతో చిట్ చాట్ చేస్తూ అన్ని సర్వేలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయని గెలుస్తారని పేర్కొనడంతో వారికి గెలుపుపై ధీమా ఏర్పడింది. దాంతో మరింత ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు.

News February 7, 2026

NZB: ఎన్నికల్లో మహిళలే కీలకం: CM

image

నిజామాబాద్ కార్పొరేషన్‌లో సగం మంది మహిళా అభ్యర్థులు ఉన్నారని, ఎన్నికల్లో మహిళలే కీలకంగా మారనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులతో సీఎం మాట్లాడారు. ఎన్నికల్లో మహిళలే కీలకంగా మారబోతున్నారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దాన్ని బట్టే విజయావకాశాలు ఉంటాయని హితవు పలికారు. అన్ని సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని వారికి వివారించారు