News November 7, 2025

తెనాలి: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

తెనాలి చెంచుపేటలోని కోనేరు బజారులోని వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. మధ్యాహ్నం ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు చేశారు. ఇద్దరు వ్యభిచార గృహ నిర్వాహకులతో పాటు ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. విటుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడని, నిర్వాహకురాలికి ఫోన్ ద్వారా నగదు చెల్లించిన ఆధారంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News January 22, 2026

సిరిసిల్ల మున్సిపాలిటీలో మహిళా రాజ్యమే!

image

సిరిసిల్ల గ్రామ పంచాయతీ నుంచి 1987లో మున్సిపాలిటీగా మారింది. తొలిసారి జరిగిన ఎన్నికల్లో రుద్ర సత్తెమ్మ చైర్మన్‌గా గెలుపొందారు. ప్రస్తుతం సిరిసిల్ల పురపాలకలో 1.01 లక్షల జనాభా ఉన్నట్లు అంచనా. 81,959 ఓటర్లకు గాను పురుషులు 39,942, మహిళలు 42,011 ఉన్నారు. మున్సిపల్లో ఇప్పటివరకు ఆరుసార్లు ఎన్నికలు జరగ్గా, 5 సార్లు మహిళలు చైర్మన్ పీఠం కైవసం చేసుకున్నారు. ఈసారి కూడా చైర్మన్ స్థానం మహిళలకే కేటాయించారు.

నెల్లూరు: పర్మిషన్ల కోసం వెయింటింగ్..!

image

నెల్లూరు జిల్లాలో అటవీ అనుమతులు రాక హైవే పనులు ఆగిపోయాయి. నెల్లూరు-చిలకలూరిపేట హైవే స్టేజ్-1 కింద 10.37 హెక్టార్లకు 2003 నుంచి ప్రయత్నిస్తే గతేడాది పర్మిషన్ వచ్చింది. స్టేజ్-2 అనుమతులకు ఈనెల 13న కేంద్రానికి ఫారెస్ట్ శాఖ ప్రతిపాదన పంపింది. నెల్లూరు-బద్వేల్ NH-65కి గతేడాదిలో ప్రతిపాదనలు పంపినా రాలేదు. అటవీ శాఖకు హైవే సంస్థ రూ.కోట్లలో పరిహారం చెల్లించాల్సి ఉండటంతోనే పర్మిషన్లు ఆలస్యమవుతున్నాయి.