News April 14, 2024
తెలంగాణలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి: మాజీ ఎమ్మెల్యే

భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి కి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ.. బోనస్ ఇస్తా అని మద్దతు ధర కూడా రైతులకు ఇవ్వట్లేదని అన్నారు. తెచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసుకున్నాం, నాలుగు నెలల్లోనే తెలంగాణలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయని మండిపడ్డారు.
Similar News
News December 11, 2025
రాజాపూర్: మెజార్టీ పెంచిన రీ కౌంటింగ్

ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సొంతూరు రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడెంలో బీజేపీ గెలుపొందింది. మొదట కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అంజలిపై 6ఓట్లతో బీజేపీ బలపర్చిన అభ్యర్థి కాటేపాగ రేవతి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు రీ కౌంటింగ్ కోరడంతో నిర్వహించిన రీకౌంటింగ్‌లో రేవతికి 36ఓట్ల మెజార్టీ లభించినట్లు అధికారులు ప్రకటించారు.దీంతో విషయం ఉమ్మడి పాలమూరు జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశమైంది.
News December 11, 2025
MBNR: ఫలితాల అనంతరం ర్యాలీలపై నిషేధం: ఎస్పీ డి జానకి

గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత ఫలితాల అనంతరం ఎలాంటి ర్యాలీలు, బైక్ ర్యాలీలు, డీజేలు, బాణసంచాలు, గుంపులుగా గుమిగూడడం పూర్తిగా నిషేధించబడిందని జిల్లా ఎస్పీ డి జానకి తెలిపారు. ఎన్నికల నియమావళిని ఎవరైనా ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతలు కాపాడడానికే ఈ చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
News December 11, 2025
MBNR: మల్లేపల్లిలో బీఆర్ఎస్ మద్దతుదారు లింగం గెలుపు

మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని మల్లేపల్లి గ్రామంలో సర్పంచ్ తొలి ఫలితం వెలువడింది. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారు లింగం 364 ఓట్ల మెజారిటీతో మరో అభ్యర్థి కావలి భాస్కర్‌పై గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడంతో గ్రామంలో సంబరాలు చేసుకుంటున్నారు. పలువురు లింగంకు అభినందనలు తెలిపారు.


