News December 1, 2025
తెలంగాణ అప్‌డేట్స్

*రైతు భరోసా ఇవ్వకుండా కౌలు రైతులను ప్రభుత్వం మోసగించిందని BRS నేత హరీశ్ విమర్శించారు.
* టెట్ దరఖాస్తులలో వివరాల సవరణ గడువు నేటితో ముగియనుంది. పేరు, ఆధార్, ఫోన్ నంబర్, అర్హతలు, సెంటర్లు మార్పు చేసుకోవచ్చు.
* కరెంటు సహా ఇతర బిల్లుల ఆధారంగా ‘ఆల్టర్నేటివ్ క్రెడిట్ స్కోరు’ ఇచ్చేందుకు ‘తెలంగాణ ఇన్ఫర్మేషన్ బ్యూరో (TIB)’ను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ స్కోరుతో బ్యాంకులు SHG సభ్యులకు లోన్లు ఇస్తాయి.
Similar News
News February 16, 2026
రేపు నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ

నులి పురుగులు చిన్నారుల్లో రక్త హీనతకు దారి తీస్తాయని బాపట్ల డీఎంహెచ్ఓ విజయమ్మ చెప్పారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా నులి పురుగుల మాత్రలు పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో మొత్తం 3.29 లక్షల మంది చిన్నారులకు మాత్రలు అందజేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. 19 ఏళ్లలోపు పిల్లలు తప్పనిసరిగా మాత్రలు తీసుకోవాలని సూచించారు.
News February 16, 2026
రేపు స్కూళ్లలో ఫ్రీగా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

AP: రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీలు, స్కూళ్లు, కాలేజీల్లో రేపు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం జరగనుంది. 1-19 ఏళ్లలోపు ఉన్న 1.11 కోట్ల మందికి ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తారు. ‘నులిపురుగుల వల్ల ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, రక్తహీనత, ఎదుగుదల లోపం వంటి సమస్యలు వస్తాయి. 400MG ఆల్బెండజోల్ మాత్రలతో వీటిని నివారించవచ్చు’ అని అధికారులు పేర్కొన్నారు.
News February 16, 2026
FLASH: మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత

AP: చంద్రగ్రహణం నేపథ్యంలో మార్చి 3న 9AM-7.30PM మధ్య శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు TTD అదనపు EO వెంకయ్య చౌదరి వెల్లడించారు. 5AM నుంచి 10AM వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. ఆ తర్వాత అన్నిరకాల దర్శనాలను, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఆ రోజున 3.20PM నుంచి 6.47PM వరకు గ్రహణం ఉంటుందన్నారు.


