News November 7, 2025

తొర్రేడు: తండ్రిని హతమార్చిన తనయుడు

image

రాజమండ్రి మండలం తొర్రేడులో బుధవారం రాత్రి దారుణ హత్య జరిగింది. కూతురు వివాహం విషయంలో తండ్రి అప్పారావును కొడుకు వడిశెల సాయికుమార్ దారుణంగా హత్య చేశాడని రాజానగరం సీఐ వీరయ్య గౌడ్ గురువారం రాత్రి తెలిపారు. పెళ్లి విషయంలో చెల్లెలిని తండ్రి తిట్టడంతో కోపోద్రిక్తుడైన సాయికుమార్ కూరగాయలు కోసే కత్తితో అప్పారావు పీక కోసి హత్య చేసినట్లు వెల్లడించారు. సాయికుమార్ పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

Similar News

News January 14, 2026

సంక్రాంతి సందడి.. పందెం కోళ్లు రె’ఢీ’

image

AP: సంక్రాంతి పండుగ వేళ కోడిపందేల సందడి మొదలు కానుంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, ఉబయ గోదావరి జిల్లాల్లో భారీ స్థాయిలో బరుల ఏర్పాట్లు చేశారు. మారుమూల ప్రాంతాలు, జిల్లా సరిహద్దుల్లో పందేలకు ఏర్పాట్లు చేస్తుండగా, వారిని కట్టడి చేసేందుకు పోలీసులు డ్రోన్లతో నిఘా పెంచారు. అయినా నిర్వాహకులు ఎక్కడా తగ్గడం లేదు. కోట్ల రూపాయల పందేలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలలో ఉండే హోటళ్లు హౌస్‌ఫుల్ అయ్యాయి.

News January 14, 2026

శ్రీకాకుళం: భోగికి దూరంగా బూరవెల్లి, లింగాలవలస గ్రామాలు

image

శ్రీకాకుళం జిల్లాలో గార మండలంలోని బూరవెల్లి, జలుమూరు మండలం లింగాలవలస గ్రామస్థులు భోగి పండగకు దూరంగా ఉంటారు. ఇతర ప్రాంతాల్లో ఉండే బంధువులంతా వచ్చినా ఇక్కడ భోగి మంటను మాత్రం వేయరు. సంక్రాంతి, కనుమ, ముక్కనుమను అందరిలాగే ఘనంగా జరుపుకొంటారు. పెద్దల కాలం నుంచి గ్రామంలో భోగి మంటను వేయడం లేదని, అందువల్ల తాము కూడా భోగి పండుగకు దూరంగా ఉంటామని బూరవెల్లి గ్రామస్థులు చెబుతున్నారు.

News January 14, 2026

సంక్రాంతి ముగ్గులు.. 4 వైపులా గీతలు గీస్తున్నారా?

image

ముగ్గును ఎప్పుడూ ఇంటి గడప, వాకిలి ముందే వేయాలి. ముగ్గు వేసిన తర్వాత నాలుగు వైపులా అడ్డగీతలు గాలి. ఇలా చేయడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవని, లక్ష్మీదేవి ఇంటిని విడిచి వెళ్లదని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా ఆ గీతలు అక్కడ శుభకార్యాలు జరుగుతున్నాయనే మంగళకరమైన సంకేతాన్ని ఇస్తాయి. ఈ నియమాలు పాటిస్తూ ముగ్గులు వేస్తే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది.