News November 19, 2025
తొలి ఆదివాసీ అగ్రనేత హిడ్మాయే!

భద్రతా బలగాల కాల్పుల్లో మృతి చెందిన హిడ్మా ప్రస్థానం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా ప్రాంతంలో ఆదివాసీ గ్రామ ఆర్గనైజర్‌గా ప్రారంభమైంది. అనంతరం మావోయిస్టుల యాక్షన్ టీమ్ ఇన్‌ఛార్జ్‌గా ఎదిగి, చివరకు కేంద్ర కమిటీకి చేరిన తొలి ఆదివాసీ అగ్రనేతగా నిలిచాడు. భద్రతా బలగాలను తప్పుదారి పట్టించి, దాడులు నిర్వహించడం హిడ్మా స్టైల్. మావోయిస్టుల నిఘా వ్యవస్థతో పాటు హిడ్మాకు ప్రత్యేక వ్యవస్థ ఉండేది.
Similar News
News January 20, 2026
మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

TG: మైనార్టీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో ప్రవేశాలకు అప్లై చేసుకోవాలని మంత్రి అజహరుద్దీన్ తెలిపారు. ఐదోతరగతి, ఇంటర్ ఫస్టియర్‌తో పాటు 6,7,8 బ్యాక్‌లాగ్ ఖాళీలకు FEB 28 వరకు <
News January 20, 2026
ఆయుష్షును పెంచే మహోద్దేశ సూత్రాలు

మంచి అలవాట్లు ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ఇస్తాయి.
ఆభరణాలు ధరిస్తే ఆయుష్షు పెరుగుతుంది.
చక్కని దుస్తులు ధరిస్తే ముఖంలో తేజోమయం అవుతుంది.
ప్రసన్నంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.
నవ్వుతూ ఉంటే సంపద కలుగుతుంది.
పట్టుదలతో కృషి చేస్తే విజయం సొంతమవుతుంది.
ఇతరులకు సహాయపడితే క్షేమం కలుగుతుంది.
తృప్తిగా ఉంటే యవ్వనంగా ఉంటారు.
మధురంగా మాట్లాడితే అదృష్టం వరిస్తుంది.
మితంగా భుజిస్తే చక్కని రూపం సొంతమవుతుంది.
News January 20, 2026
ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలంటే?

గర్భం ధరించిన విషయం మహిళలు ఎంత త్వరగా గుర్తిస్తే బిడ్డకు అంత మంచిదంటున్నారు నిపుణులు. చాలామంది నెలసరి మిస్సవగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు. అప్పుడు గర్భం ధరించినా కొన్నిసార్లు నెగెటివ్ రావచ్చు. నెలసరి మిస్సయిన వారానికి టెస్ట్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రెగ్నెంట్ అయినా ఒక్కోసారి కొంతమందిలో నెగెటివ్ వస్తుంటుంది. మీకు లక్షణాలేమైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.


